National University
-
భళా 'ఏఐ'.. మైండ్ రీడింగ్ టెక్నాలజీలో అద్భుతం!
Mind Reading AI Technology: ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.. ఈ నేపథ్యంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇప్పటికే పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్ కంపెనీల విషయంలో 'ఏఐ' సంచలనాలు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఏఐ మనిషి మైండ్ కూడా చదివేస్తుందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తాజాగా సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మనసును చదవగలిగే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో మనిషి మనసును కూడా ఏఐ చదవగలదని చెబుతున్నారు. ఈ ఆధునిక టెక్నాలజీ మీద పరిశోధన బృందంలో ఒకరైన 'లి రుయిలిన్' కీలక విషయాలు వెల్లడించారు. ప్రతి మనిషికి ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారని, దానిని తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ఇలాంటి వాటికోసం మైండ్ రీడింగ్ ఏఐ టెక్నాలజీ రూపొంచాలని సంకల్పించి ప్రయోగం ప్రారంభించామని, మొదట్లో తన మెదడుని ఈ టెక్నాలజీ ఆధారంగా పరిశీలించగా అద్భుతమైన ఫలితం వచ్చిందన్నారు. మొత్తం మీద మెదడు ఆలోచనను పసిగట్టే టెక్నాలజీ చాలా అద్భుతం అని వెల్లడించారు. ఇదీ చదవండి: దేశీయ మార్కెట్లో మరో జర్మన్ కారు - ధర రూ. 1.14 కోట్లు MRI స్కాన్ ద్వారా.. మైండ్ రీడింగ్ AI ని అభివృద్ధి చేయడంలో పనిచేస్తున్న పరిశోధకులకు 58 మంది తమ మైండ్ పరిశోధన చేసుకోవచ్చని స్వచ్చందగా ముందుకు వచ్చారు. అందులో లి రుయిలిన్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఈ టెక్నాలజీ పూర్తిగా MRI స్కాన్ ద్వారా కొనసాగుతుంది, ఇందులో భాగంగా మెదడుకి సంబంధించి సుమారు 1200 నుంచి 5000 చిత్రాలను తీసి, దానిపై స్టడీ చేసి అసలు విషయం గుర్తించడం జరుగుతుంది. ఇదీ చదవండి: ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఆగండాగండి.. ఇవి చెక్ చేశారా? చాట్ జీపీటీ మనుషుల భాషను అర్థం చేసుకున్నట్లే.. ఏఐ మానవ మెదడుని కూడా అర్థం చేసుకుంటుంది. అంటే మనసులోని ఆలోచనలను చదివి పరిశోధకులకు అందిస్తుందన్నమాట. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిందంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే దీనిని ఎవరైన అనవసర విషయాలకు లేదా తప్పుడు పనులకు ఉపయోగిస్తే పెద్ద ముప్పు వాటిల్లుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని రక్షించండి
కోల్‌కతా: ‘‘దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అధికారాలన్నింటినీ క్రమంగా అధికార పార్టీ నేతృత్వంలోని ఒకే ఒక వర్గం చెరబడుతోంది. ఈ పెడ ధోరణి ఇలాగే కొనసాగితే దేశం అంతిమంగా అధ్యక్ష తరహా పాలనలోకి వెళ్లేందుకు ఎంతో కాలం పట్టదు’’ అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడేందుకు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఆదివారం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ (ఎన్‌యూజేఎస్) స్నాతకోత్సవంలో మమత పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ అయిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్‌తో సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దయచేసి ప్రజాస్వామ్యాన్ని, దేశ సమాఖ్య వ్యవస్థను కాపాడండి’’ అంటూ సీజేఐని అభ్యర్థించారు. ఏ అంశంపై అయినా కోర్టుల్లో తీర్పు వెలువరించడానికి ముందే మీడియా సొంత తీర్పులు ఇచ్చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘వారు ఎవరినైనా నిందించొచ్చా? ఎవరి మీదైనా అభియోగాలు మోపొచ్చా? మా ప్రతిష్ట మాకు ప్రాణం. అది పోతే సర్వం పోయినట్టే. ఇలా మాట్లాడుతున్నందుకు మన్నించండి. తప్పయితే క్షమాపణలు చెబుతా. ప్రజలు న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయారని నేననడం లేదు. కానీ కొద్ది రోజులుగా పరిస్థితులు బాగా దిగజారుతున్నాయి. ప్రజలు నిశ్శబ్దంగా రోదిస్తున్నారు. వారి ఆక్రందనను న్యాయ వ్యవస్థ ఆలకించాలి. ఈ అన్యాయం బారి నుంచి కాపాడాలి’’ అని సీజేఐని కోరారు. -
నీటి కాసులను గుర్తిస్తుంది... కత్తిపోటుకు కట్టు వేస్తుంది!
James Dyson Award 2021: Plastic Scanner Device Won Dyson Award: యువత తన మస్తిష్కానికి పదును పెడితే ఎన్నో ఆలోచనలు వస్తాయి. అతి క్లిష్టమైన సమస్యల నుంచి చిన్న చిన్న ఇబ్బందులకు కూడా సమాధానం చెప్పే ఆవిష్కరణలు పుడతాయి. నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రూపొందించిన సృజనాత్మక ఆవిష్కరణలను అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తున్నారు జేమ్స్ డైసన్. వివిధ దేశాలకు చెందిన యువత రూపొందించిన ఆవిష్కరణలకు ఏటా డైసన్ అవార్డులు అందజేస్తున్నారు. ఈ ఏడాది 28 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వివిధ విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన ఆవిష్కరణలను ఇటీవలే ప్రకటించారు. ఇవీ ఈ ఏడాది డైసన్ అవార్డు సాధించిన ఆవిష్కరణలు.. ఇంట్లోనే కంటి పరీక్ష వృద్ధుల్లో కంటిచూపు మందగించి పోయేలా చేసే నీటి కాసులను ఇంట్లోనే గుర్తించేందుకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు హోప్స్ (హోమ్ ఐ ప్రెషర్ ఈ–స్కిన్ సెన్సర్) పేరుతో వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఫొటోలో చూపిన నల్లటి చేతి తొడుగును కంటి వద్ద ఉంచుకోవడం ద్వారా కంటి లోపలి భాగాలపై పడుతున్న ఒత్తిడిని గుర్తించొచ్చు. ఇందుకోసం పరికరంలో సెన్సర్‌ను అమర్చారు. ఇది కంటిపై పడే ఒత్తిడిని బాగా గుర్తించగలదు. పరికరాన్ని కనురెప్ప మధ్యభాగంలో ఉంచితే ఒత్తిడి సమాచారాన్ని మెషీన్ లెర్నింగ్ సాయంతో విశ్లేషించి ఫలితాలు స్మార్ట్‌వాచ్‌లో ప్రదర్శితమవుతాయి. ఈ పరికరం డైసన్ అవార్డుల్లో అంతర్జాతీయ విభాగంలో విన్నర్‌గా నిలిచింది. ప్లాస్టిక్ రకాలను పట్టేస్తుంది ప్లాస్టిక్ కాలుష్యాన్ని వదిలించుకోవాలంటే.. వ్యర్థాల్లో ఏది ఏ రకమైందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటివరకు ఇలా వేర్వేరు రకాల ప్లాస్టిక్‌ను గుర్తించడం కొంత శ్రమతో కూడుకున్న పని. నెదర్లాండ్స్‌కు చెందిన డెఫ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ వినూత్నమైన ప్లాస్టిక్ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. పరారుణ కాంతి స్పెక్ట్రోస్కోపీ సాయంతో పనిచేస్తుంది. చిత్రంలో చూపినట్లు చేత్తో పట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఈ స్కానర్ సాయంతో ఏ రకమైన ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే అవకాశం ఉందో స్పష్టంగా గుర్తించవచ్చు. ఎక్కడికక్కడ ప్లాస్టిక్ రీసైకిల్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో భారీ రీసైక్లింగ్ కేంద్రాల్లో ప్లాస్టిక్‌ను వేరు చేసేందుకు పెడుతున్న ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ పరికరం డైసన్ అవార్డుల్లో సస్టెయినబిలిటీ విభాగంలో తొలిస్థానంలో నిలిచింది. కత్తిపోట్ల చికిత్సకు కొత్త పరికరం కత్తిపోట్లు లేదా శరీరంలోకి పదునైన వస్తువులు చొచ్చుకుపోయినప్పుడు అయ్యే గాయాలకు మెరుగైన చికిత్స కల్పించేందుకు యూకేకు చెందిన లౌబరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. కత్తిపోట్ల గాయల ద్వారా అయ్యే రక్తస్రావాన్ని వేగంగా నిరోధించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇలాంటి గాయాలైనప్పుడు చాలామంది అందుకు కారణమైన కత్తి, ఇతర వస్తువులను శరీరం నుంచి తీసేస్తుంటారని, దీనివల్ల రక్తస్రావం ఎక్కువవుతుంది. రియాక్ట్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరంలో సిలికాన్‌తో తయారైన గాలిబుడగ ఉంటుంది. గాయంలోకి ఈ గాలిబుడగను చొప్పించి ఉబ్బిపోయేలా చేస్తారు. అదే సమయంలో గాయం లోపలి భాగాలపై ఒత్తిడి పెరిగి రక్తస్రావం అదుపులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన మెడికల్ విభాగంలో ఈ పరికరం ఫస్ట్ ప్రైజ్ కొట్టేసింది. – సాక్షి, హైదరాబాద్ -
రోజుకు ఓ కప్పుటీతో మతిమరుపు దూరం
సింగపూర్: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం మానవుడిలో సొంతంగా ఆలోచించే శక్తిని రాను రాను తగ్గించేస్తోంది. ప్రతి చిన్న పనికీ ఇంటర్నెట్, కంప్యూటర్, క్యాలిక్యులేటర్ వంటివాటిపై ఆధారపడడంతో ఆలోచనాశక్తితోపాటు జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా డిమెన్షియా(మతిమరుపు/చిత్తవైకల్యం) సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే దీనికి విరుగుడు రోజు ఓ కప్పు టీ తాగడమేనని చెబుతున్నారు పరిశోధకులు. రోజూ ఓ కప్పు టీ తాగడం వల్ల డిమెన్షియా సమస్య తగ్గుతుందని సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. 55 ఏళ్లు పైబడిన 957 మంది చైనీయులపై పరిశోధన చేసి ఈ నిర్ధారణకు వచ్చామని చెప్పారు. జన్యుపరంగా వచ్చిన మతిమరుపు సమస్యతో బాధపడుతున్నవారిలో కూడా ప్రతిరోజూ టీ తాగడం వల్ల సమస్య కొంతమేర తగ్గుముఖం పట్టినట్లు గుర్తించామన్నారు. అయితే ఏ రకమైన టీ తాగినా ఇవే ఫలితాలు వెల్లడయ్యాయని చెప్పారు. డిమెన్షియాతో బాధపడుతున్నవారిలో సమస్య తీవ్రతను తగ్గించేందుకు అధిక మోతాదులో మందులను వినియోగించాల్సి ఉంటుందని, అయితే మందులు వాడిన తర్వాత కూడా సమస్య మళ్లీ ప్రారంభం కావడం గుర్తించామని, అందుకే ప్రత్యామ్నాయంగా ప్రతిరోజూ టీ తాగడం వల్ల కొంతమేర సత్ఫలితాలు ఉంటాయని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫెంగ్ లీ అభిప్రాయం వ్యక్తం చేశారు.