
లండన్ : పరిమిత మోతాదులో వైన్ తీసుకుంటే కుంగుబాటు దూరమవుతుందని తాజా అథ్యయనంలో వెల్లడైంది. ద్రాక్షలో ఉండే పదార్ధాలు కుంగుబాటుకు గురైన ఎలుకల్లో ప్రశాంతతను చేకూర్చినట్టు ఈ అథ్యయనంలో గుర్తించారు. వైన్‌లో వాడే ద్రాక్ష రసంలో ఉండే కొన్ని పదార్థాలు కణాల వాపును తగ్గించడంతో పాటు మెదడులో ట్రాన్స్‌మిషన్ సిగ్నల్స్‌ను మెరుగుపరుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం డిప్రెషన్‌కు అందిస్తున్న చికిత్సలు కేవలం 50 శాతం కేసుల్లోనే తాత్కాలిక రిలీఫ్ ఇస్తున్నాయని తేలిన క్రమంలో తాజా అథ్యయనంలో వెల్లడైన ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని వారంటున్నారు. నేచర్ కమ్యూనికేషన్స్లో జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురించారు. కాగా డిప్రెషన్ చికిత్సలో మరింత మెరుగైన థెరఫీలు అవసరమని ఈ పరిశోధన చేపట్టిన న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హాస్పిటల్ రీసెర్చర్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment