పొగరాయుళ్లకు ఆదాయమూ తక్కువే
లాస్ ఏంజె లెస్: ధూమపానం వల్ల ఆయుష్షుకే కాదు ఆదాయానికీ గండి పడుతోంది. ఇటీవల జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. పొగతాగని వారితో పోలిస్తే, పొగతాగే వారే తక్కువగా సంపాదిస్తున్నారని అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు.
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 217 మంది నిరుద్యోగులను ఎంచుకొని పరిశోధకులు వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. ఇందులో 109 మంది పొగతాగేవారు కాగా, మిగతావారు పొగతాగని వారు. ఏడాది తర్వాత వీరిలో పొగతాగని వారు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగం సంపాదించారు. పొగతాగే వారు, తాగని వారి కంటే గంటకు 5డాలర్లు తక్కువగా సంపాదిస్తున్నట్లు ఈ పరిశోధన లో తేలింది.