మీ సరదా కోసం మీ పిల్లల్ని బలి చేయకండి! | Don't smoke for childerns | Sakshi
Sakshi News home page

మీ సరదా కోసం మీ పిల్లల్ని బలి చేయకండి!

Published Sun, Jun 28 2015 10:50 PM | Last Updated on Mon, Oct 22 2018 2:06 PM

మీ సరదా కోసం మీ పిల్లల్ని బలి చేయకండి! - Sakshi

మీ సరదా కోసం మీ పిల్లల్ని బలి చేయకండి!

కొత్త పరిశోధన
తండ్రులకు పొగతాగే అలవాటు ఉంటే, ఆ పొగ కుటుంబసభ్యులందరూ పీల్చడం (ప్యాసివ్ స్మోకింగ్)వల్ల అమాయకులైన వారి  చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటుదన్న సంగతి తెలిసిందే. ఇది ఇటీవలి రెండు అధ్యయనాల్లో ఈ విషయం మరింత స్పష్టంగా తేలింది. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు దాదాపు 26 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా తేలిన విషయం ఏమిటంటే... తండ్రులకు పొగతాగే అలవాటు ఉంటే, వారి పిల్లలు పెద్దయ్యాక వారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని తేలింది.

పొగతాగే తండ్రుల ఈ పిల్లలను పెద్దయ్యాక పరీక్షించి చూస్తే... గుండె నుంచి మెదడుకు రక్తాన్ని చేరవేసే ‘కెరోటిడ్’ రక్తనాళాలు బాగా సన్నబడిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఈ పిల్లలు పెద్దవారయ్యాక పొగతాగకపోయినా, ఈ పరిణామాలు సంభవించడం పరిశోధనవేత్తలను తీవ్రంగా ఆందోళన పరిచింది.  దాంతో పొగతాగని తండ్రుల పిల్లలతో పోలిస్తే, పొగతాగే అలవాటున్న తండ్రుల పిల్లలకు గుండెజబ్బు, పక్షవాతం వచ్చే అవకాశాలు 1.7 రెట్లు ఎక్కువ. పిల్లలకు ఈ రిస్క్‌ను తప్పించాలంటే తండ్రులు పొగతాగడం పూర్తిగా మానేయాలని ఈ పరిశోధనవేత్తలు ‘ద సర్క్యులేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement