టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ఎక్కువవుతోంది. అన్ని రంగాల్లో కృత్రిమ మేధస్సు పనిచేస్తోంది. అయితే ఈ టెక్నాలజీ మార్కెటింగ్ రంగం కొంప ముంచుతోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
ఏఐ అనేది నేడు స్మార్ట్‌ఫోన్, గూగుల్, ఇంటర్నెట్‌లలో కనిపించే సాధారణ పదం అయిపోతోంది. యాడ్స్ విషయంలో కూడా ఏఐ హవా సాగుతోంది. ఇది తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచే అవకాశం ఉందని సంస్థలు కూడా భావిస్తున్నాయి. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ (WSU) పరిశోధకుల ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రకటనలలో ఏఐ ఉపయోగించడం వల్ల అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని వారు స్పష్టంగా వెల్లడించారు.
ఏ రంగంలో ఏఐ ఎలా ఉపయోగపడినా.. అమ్మకాల విషయంలో మాత్రం ఇది అంత నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. దీంతో సేల్స్ గణనీయంగా తగ్గుతాయని తెలుస్తోంది. జర్నల్ ఆఫ్ హాస్పిటాలిటీ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఈ విషయాలను వెల్లడించింది.
ఏఐ క్రియేట్ చేసిన లేబుల్స్ కస్టమర్లను ఎక్కువ ఆకర్శించలేవు. ఏఐ భావోద్వేగాలను తగ్గిస్తుంది. అమ్మకాల్లో ఎమోషన్ చాలా ప్రధానం, ఏఐ అదే విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచలేకపోతోందని డబ్ల్యూఎస్‍యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మెసూట్ సిసెక్ వెల్లడించారు.
కంపెనీలు తమ మార్కెటింగ్‌లో ఏఐను ఎలా ప్రదర్శించాలో జాగ్రత్తగా పరిశీలించాలని అధ్యయనం సూచిస్తుంది. మార్కెటర్లు ఫీచర్లు లేదా ప్రయోజనాలను వివరించడంపై దృష్టి పెట్టాలి. ఏఐ బజ్‌వర్డ్‌లను నివారించాలని సిసెక్ సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment