
అన్నింటా అమ్మ ఉంటే.. !
ఈ లోకంలో అడుగుపెట్టిన ఏ బిడ్డకైనా అమ్మతోడిదే తొలి బంధం. అమ్మే తొలి నేస్తం. అమ్మే తొలి గురువు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలోంచి ఓ కొత్త కోణాన్ని వెలికి తీశారు కొందరు పరిశోధకులు. పిల్లలు, వారి ప్రవర్తన, వారిలోని నైపుణ్యాలపై ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో, తల్లి తమ పక్కనే ఉన్నప్పుడు పిల్లలు ఎంతో చురుకుగా ఉంటారని తేలింది. కొందరు పిల్లలకు పాఠ్యాంశాలపై పరీక్షలు నిర్వహించారు. ఆపైన వారిని తమకు నచ్చిన పని చేయమని కూడా చెప్పడంతో బొమ్మలు గీయడం, ఏవో వస్తువులు తయారు చేయడం, ఇలా తమకు తోచిన పనులు చేశారు.
అదే పిల్లల్ని తమ తల్లులతో కలిపి కూర్చోబెట్టి మళ్లీ అవన్నీ చేయమంటే... మొదటిసారి అంతంతమాత్రంగా ప్రతిభ చూపినవాళ్లు కూడా చక్కటి ప్రతిభను ప్రదర్శించారట. దాంతో తల్లి దగ్గరగా ఉంటే పిల్లలు అన్నింటిలో రాణిస్తారని నిర్థారిం చేశారు పరిశోధకులు. అర్థమైంది కదా! కేవలం వండి పెట్టడం, తయారుచేసి స్కూలుకు పంపడం చేస్తే సరి పోదు. వారు చేసే ప్రతి పనిలోనూ తల్లి బాధ్యత పంచు కోవాలి. అప్పుడు వాళ్లు అన్నింట్లో ముందుంటారు!