చైనా ల్యాబ్‌లో మరో ప్రాణాంతక వైరస్‌? | China Controversial Study Researchers Ebola Optic Nerve Disorders | Sakshi
Sakshi News home page

చైనా ల్యాబ్‌లో మరో ప్రాణాంతక వైరస్‌?

Published Sun, May 26 2024 8:21 AM | Last Updated on Sun, May 26 2024 1:08 PM

China Controversial Study Researchers Ebola Optic Nerve Disorders

చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోని మరో కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా మాదిరిగానే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. మనిషిని కేవలం మూడు రోజుల్లోనే చంపేస్తుంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే శాస్త్రవేత్తులు ఈ వైరస్ సృష్టించారు. అయితే ఇప్పుడు ఈ వైరస్‌ ప్రయోజనాలు,  ప్రమాదాలపై సర్వత్రా చర్చ  జరుగుతోంది. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్ స్వభావం సింథటిక్ అని తెలుస్తోంది. ఈ అధ్యయన నివేదిక సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురితమయ్యింది.

ఎబోలా వైరస్‌ను ఉపయోగించి సృష్టించిన ఈ కొత్త వైరస్‌పై సాగిస్తున్న పరిశోధన వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన  ఉద్దేశ్యం వివిధ వ్యాధులను నివారించడం, లక్షణాలను పరిశోధించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్‌ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్నే చూపుతుంది. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుండి గ్లైకోప్రొటీన్ (జీపీ)ని స్వీకరించేందుకు వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ (వీఎస్‌వీ)ని ఉపయోగించింది.

ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు సిరియన్ హామ్స్టర్స్ (జంతు జాతులు) సమూహంపై పరీక్షించారు. వీటిలో ఐదు మగ, ఐదు ఆడ జాతులున్నాయి. ఈ జంతువులకు ఈ వైరస్‌ను ఇంజెక్ట్ చేయగా, వాటిలో ఎబోలా లాంటి లక్షణాలు కనిపించాయి. మూడు రోజుల్లో అవన్నీ  మృతి చెందాయి. ఈ వైరస్‌ ఇంజక్ట్‌ చేయగానే కొన్ని జంతువుల కళ్లు దెబ్బతిన్నాయి. ఆప్టిక్ నరాలలోపై తీవ్రమైన ప్రభావం కనిపించింది. కాగా 2014- 2016 మధ్య  కాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందింది. దీనివల్ల వేలాది మంది మృత్యువాత పడ్డారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement