
టాప్ పాస్‌వర్డ్.. 123456
వాషింగ్టన్: 2016వ సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికులు ఉపయోగించిన పాస్‌వర్డ్స్‌లో ‘123456’ ప్రథమ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో ‘123456789’, క్వెర్టీ(క్యూడబ్ల్యూఈఆర్‌టీవై) నిలిచాయి. కోటి సెక్యూరిటీ కోడ్స్‌ను పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, టాప్ 10లోని నాలుగు పాస్‌వర్డ్స్‌లో ఆరు లేదా అంతకు తక్కువ కేరక్టర్లే ఉన్నాయి.
టాప్‌టెన్‌లో 123123, 111111, 987654321 కూడా ఉన్నాయి. హ్యాకింగ్ ముప్పు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సులభ పాస్‌వర్డ్స్ పెట్టుకోవడం ఆత్మాహత్యాసదృశ్యమేనని పరిశోధకులు పేర్కొన్నారు.