కంప్యూటర్ యుగం ఇది. ప్రతి చిన్న పనికి మనం టెక్నాలజీపై ఆధారపడుతున్నాం. మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్, మెయిల్స్‌లలో మన వ్యక్తిగత సమాచారాన్ని దాచుకుంటున్నాం. ఈ సమాచారం అంతా బహిర్గతం కాకుండా ఉంచడంలో పాస్‌వర్డ్‌లు కీరోల్ పోషిస్తున్నాయి. అందుకే మనం క్రియేట్ చేసే పాస్ వర్డ్ చాలా కష్టంగా ఉండాలని నార్డ్ పాస్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. తేలికైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేస్తే.. హ్యాకర్లు సులభంగా సమాచారాన్ని తస్కరిస్తారని హెచ్చరించింది.
ఇక ఈ ఏడాదికి గాను ప్రపంచంలో అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఇవేనని కొన్ని రకాల పాస్‌వర్డ్‌లను విడుదల చేసింది. 2020లో అత్యంత చెత్త పాస్ వర్డ్ 123456 అని వెల్లడించింది. దీన్ని హ్యాకర్లు 2.3 కోట్ల సార్లు ఛేదించారట. దీని తర్వాత స్థానంలో 1234567889 ఉంది. మూడో స్థానంలో picture1 అనే పాస్ వర్డ్ నిలిచింది. వీటితో పాటు password,123456, qwerty, ‘111111’, ‘12345678’, ‘123123’, '12345' '1234567890’, ‘1234567’, ‘qwerty, ‘abc123’, ‘Million2’, ‘000000’, ‘1234’, ‘iloveyou’, ‘aaron431’, ‘password1’, ‘qqww1122’లను అత్యంత చెత్త పాస్ట్‌వర్డ్‌లుగా ప్రకటించింది.
ప్రపంచంలో అనేకమంది ఇలా సాధారణమైన పాస్ వర్డ్ లు పెట్టుకుని హ్యాకర్ల బారినపడుతుంటారని నార్డ్ పాస్ వెల్లడించింది. ఆన్ లైన్ లో మన వ్యక్తిగత సమాచారం, ఆన్ బ్యాంకింగ్ లో మన డబ్బు సురక్షితంగా ఉండాలంటే క్లిష్టంగా ఉండే పాస్ వర్డ్ ను ఎంపిక చేసుకోవాలని, లేదంటే హ్యాకర్ల ఉచ్చులో పడాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. అలాగే ప్రతి 90 రోజులకు ఒకసారి పాస్ట్‌వర్డ్‌లను మార్చు కోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment