
ఈ చెయ్యి చూస్తుంది కూడా!
లండన్: చేతులు లేని వికలాంగుల కోసం బ్రిటన్ బయో–ఇంజనీర్లు చూపున్న చేతిని తయారు చేశారు. మెదడుతో సంకేతాలు పంపగానే ఇది వస్తువును చూసి దానిని అందుకుంటుందట. ఇందుకోసం ఈ బయోనిక్ హ్యాండ్‌కు 99 పిక్సెళ్ల కెమెరాను అమర్చారు. ఇది పక్కనున్న వస్తువును చూసి పసిగట్టి సెకన్ల వ్యవధిలోపే చేతికి సంకేతాలు పంపుతుంది.
బయోనిక్ హ్యాండ్‌కు కంప్యూటర్ విజన్ ఉంటుంది కాబట్టి కప్ లేదా బిస్కట్ వంటి పరికరాలను సాధారణ చెయ్యి లాగే అందుకుంటుందని న్యూ కజిల్ యూనివర్సిటీ పరిశోధకుడు కియనుష్ నజర్‌పూర్ తెలిపారు. కృత్రిమ అవయవాలతో ఇలాంటి పనులు చేయలేమన్నారు.