టీవీ వంటల ప్రోగ్రామ్‌తో కనువిందే చేసుకోండి | TV Dishes program | Sakshi
Sakshi News home page

టీవీ వంటల ప్రోగ్రామ్‌తో కనువిందే చేసుకోండి

Published Mon, Jun 22 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM

TV Dishes program

మీకు టీవీల్లో వంటల కార్యక్రమాలు చూసే అలవాటుందా? అవి చూశాక వాటిని ఇంట్లో తయారు చేసుకునే అలవాటు కూడా ఉందా? అలా అయితే కాస్త జాగ్రత్త అని చెబుతున్నారు పరిశోధకులు. వీళ్ల అధ్యయన వివరాలన్నీ ‘ఎపిటైట్’ అనే హెల్త్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. ఆ వివరాల ప్రకారం... 20 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న దాదాపు 500 మంది మహిళలను ఎంపిక చేశారు ఈ అధ్యయనవేత్తలు. వీళ్లను రెండు వర్గాలుగా విభజించారు.

వారే... వ్యూవర్స్ అండ్ డూవర్స్. అంటే కేవలం వంటల కార్యక్రమాన్ని చూసేవారూ, చూసినవి చేసేవారు అని వర్గీకరించారు. చూసి ఆనందించేవారితో పోల్చినప్పుడు, వాటిని ఇంట్లోనూ వండి తినే వారు చాలా కొద్ది సమయంలోనే సగటున దాదాపు 5 కిలోల (పదకొండు పౌండ్లు) బరువు పెరిగినట్లు గమనించారు. ఈ బరువు చాలా ఎక్కువనీ, ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. పైగా చూసినవి, చేసుకుని తినేవారిలో చాలామందికి పొట్టపెరగడం (సెంట్రల్ ఒబేసిటీ) పెరిగిందట. ఇది గుండెజబ్బులు మొదలుకొని ఆరోగ్యానికి అనేక అనర్థాలు తెచ్చిపెడుతుందని ‘ఎపిటైట్’ జర్నల్‌లో హెచ్చరించారు సదరు పరిశోధకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement