టీవీ సీరియల్ నటిని ప్రేమ, పెళ్లి పేరుతో వేధించిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ టెలివిజన్ ఛానల్‌లో టెలీకాస్ట్ అవుతున్న 'శ్రావణ సంధ్య' అనే సీరియల్‌లో నటిస్తున్న మహిళను అదే యూనిట్‌లో పనిచేస్తున్న బత్తుల ఫణితేజ కొంతకాలంగా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు.
సీరియల్ యూనిట్ సభ్యుల వద్దే కాకుండా సోషల్‌మీడియాలో ఆమె క్యారెక్టర్‌ను దిగజార్చేవిధంగా తప్పుడు ప్రచారం చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment