
ఈ వీకెండ్ లో పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. సరే వాటి సంగతి పక్కనబెడితే ఓ తెలుగు మూవీ.. పెద్దగా హడావుడి లేకుండానే దాదాపు ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఏ మూవీ? ఎందులో ఉందనేది చూద్దాం.
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కథతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. వాటిలో సూపర్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు(1974) ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. కొన్నిరోజుల క్రితం 'ఆర్ఆర్ఆర్'లోనూ రామ్ చరణ్ అల్లూరి గెటప్ లో కనిపించి అలరించాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
ఇక అల్లూరి జీవిత కథతో తీసిన ఓ తెలుగు సినిమా 'మన్యం ధీరుడు'. గతేడాది సెప్టెంబరులో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ ఈ చిత్రం ఒకటి ఉందని కూడా తెలియదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ.. అల్లూరిగా నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు.
దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు 'మన్యం ధీరుడు' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో అందుబాటులో ఉంది. రెండు రోజుల క్రితం ఇలానే 'తల', 'జాతర' మూవీస్ ఇదే ఓటీటీలోకి వచ్చాయి.
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. కేవలం తెలుగులో)
Comments
Please login to add a commentAdd a comment