![యాంకరమ్మకు కోటి రూపాయలు? - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/2/71412054669_625x300.jpg.webp?itok=pgFjIQEd)
యాంకరమ్మకు కోటి రూపాయలు?
న్యూస్ రీడర్ నుంచి యాంకర్గా మారిన అనసూయకు ....తమ చిత్రంలో నటింపచేసేందుకు ఓ నిర్మాత కోటి రూపాయలు పారితోషికం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జబర్దస్ కామెడీ షో ద్వారా బోల్డంత గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు.... టాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. ఏడాది క్రితం పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయను సంప్రదించారని, అయితే ఐటం సాంగ్స్ చేయనని ఆమె ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇద్దరు పిల్లలు తల్లి అయినా అనసూయకు మాంచీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అనసూయకు హీరోయిన్ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందు కోసం సదరు నిర్మాత ఆమెకు కోటి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దం అయినట్లు... అయితే అందుకు ఆ నిర్మాత అనసూయని మూడు నెలల డేట్స్ అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్పై అనసూయ మాత్రం పెదవి విప్పటం లేదు.
ఇక హీరోయిన్ స్వాతి కూడా ఒకప్పుడు బుల్లితెర యాంకరే. మా టీవీలో కలర్స్' ప్రోగ్రామ్తో ఆమె పాపులర్ అయిన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో స్వాతి నటిస్తోంది. మరో యాంకర్ ఉదయభాను కూడా పలు చిత్రాలు నటించింది కూడా. అయితే అవేమీ ఆమెకు అంత గుర్తింపు తెచ్చివ్వలేకపోయాయి. రానా హీరోగా నటించిన 'లీడర్'లో రాజశేఖరా నీ పై....అంటూ ఓ సాంగ్లో నర్తించిన విషయం తెలిసిందే. మరి బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించిన అనసూయ వెండితెరపై రాణిస్తుందా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.