Banjarahillas police station
-
తెలుగు సీరియల్ నటి ఫిర్యాదు.. యువకుడి అరెస్ట్
టీవీ సీరియల్ నటిని ప్రేమ, పెళ్లి పేరుతో వేధించిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ టెలివిజన్ ఛానల్లో టెలీకాస్ట్ అవుతున్న 'శ్రావణ సంధ్య' అనే సీరియల్లో నటిస్తున్న మహిళను అదే యూనిట్లో పనిచేస్తున్న బత్తుల ఫణితేజ కొంతకాలంగా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రేమించానని, పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. సీరియల్ యూనిట్ సభ్యుల వద్దే కాకుండా సోషల్‌మీడియాలో ఆమె క్యారెక్టర్‌ను దిగజార్చేవిధంగా తప్పుడు ప్రచారం చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
పబ్ వ్యవహారం: ‘జాబితా’పై హైడ్రామా!
సాక్షి, హైదరాబాద్: సినీ–వ్యాపార ప్రముఖులు, రాజకీయ నేతల పిల్లలు పట్టుబడిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో హైడ్రామా చోటు చేసుకుంది. పబ్‌లో పట్టుబడిన అందరినీ ఆదివారం తెల్లవారుజామునే బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సినీ నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్‌బాస్ సీజన్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక, రాజకీయవేత్తల కుమారులు, కుమార్తెలు అందులో ఉన్నారు. పోలీసులు ఉదయం 8.30–9.00 గంటల మధ్య వీరందరికీ నోటీసులు జారీచేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉదయం 8.30 గంటల సమయంలో రాహుల్ సిప్లిగంజ్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అప్పటికే మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇది చూసిన నిహారిక బయటికి రాకుండా మధ్యాహ్నం వరకు లోపలే ఉండిపోయారు. చివరికి 12 గంటల సమయంలో బయటికి వచ్చారు. మీడియా ప్రతినిధులు చుట్టుముట్టినా.. తనఫోన్‌లో మాట్లాడుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోయారు. అయితే పోలీసులు పబ్‌లో 142 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మధ్యాహ్నం అనధికారిక లిస్టును విడుదల చేశారు. అందులో నిహారిక పేరు లేకపోవడంతో.. ఆమెను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో సాయంత్రం అనధికారికంగానే మరో ప్రకటన చేసిన పోలీసులు.. నిహారికతోపాటు మరో ఐదుగురి పేర్లను కూడా జోడించారు. దీనితో మొదట చెప్పిన జాబితా 142 నుంచి 148కి పెరిగింది. పబ్‌లో అదుపులోకి తీసుకున్నవారిలో ఓ పోలీసు ఉన్నతాధికారి కుమార్తె సైతం ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ జాబితాలో ఆ పేరు కనిపించలేదు. కాగా.. పబ్ వ్యవహారంలో తనకేం సంబంధం లేకున్నా ఓ చానల్ వాళ్లు తన పేరును ప్రచారం చేస్తున్నారంటూ సినీ నటి హేమ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ వద్ద హల్చల్ చేశారు. -
డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ
బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్ (కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో 145 మందిని పంపివేయగా పోలీసుల అదుపులో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారు. అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును పలు ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని నటి హేమ మండిపడ్డారు. తన గురించి అవాస్తవాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు 'నేను అసలు పబ్‌కు వెళ్లలేదు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కొందరు కావాలనే నా పేరును ప్రసారం చేస్తున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే ఇక్కడికి వచ్చాను.' అని హేమ మీడియాతో తెలిపారు. కాగా పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో పబ్‌లో ఉన్న ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారికతోపాటు పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో ముంబై యువతిపై దారుణం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్లో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతికి మద్యం తాగించి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మే నెలలో చోటుచేసుకుంది. తాజాగా ఆమెపై అత్యాచారాయత్నానికి పాల్పడిన యువకుడు బాధితురాలికి వాట్సప్ ద్వారా న్యూడ్ వీడియోలు పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు.(చదవండి : శ్వేతను అజయే పట్టాల దగ్గరకు తీసుకెళ్లాడు’) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ప్రజక్త అనే యువతి క్రిష్ణ చౌదరి ద్వారా బాధితురాలికి ముంబైలో పరిచయమైంది. అన్షూ కుక్రేజా అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని.. అతని కంట పడకుండా బాధితురాలి ఇంట్లో ఉంటానని ప్రజక్త రిక్వెస్ట్ చేసింది. ప్రజక్త రిక్వెస్ట్‌ను అంగీకరించిన బాధితురాలు ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది. కాగా మే10న స్వీటీ అనే యువతి ప్రజక్తకు ఫోన్ చేసి హైదరాబాద్‌లో జుబేర్ అనే మిత్రుడి బర్త్‌డే పార్టీ ఉందని తప్పక రావాలని పేర్కొంది. కాగా మే11న బాధితురాలితో కలిసి వచ్చిన ప్రజక్త.. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్లో బస చేశారు. అదే రోజు రాత్రి స్వీటీ, జుబేర్‌లు హోటల్‌కు వెళ్లి బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. అనంతరం జుబేర్, ప్రజక్త, స్వీటీలు కలిసి బాధితురాలికి బలంవంతగా మద్యం తాగించారు. తర్వాత జుబేర్ బాధితురాలిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించడంతో స్వీటీతో కలిసి జుబేర్ హోటల్ నుంచి వెళ్లిపోయాడు. కాగా మే14న ముంబైకి చేరుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జుబేర్‌పై కేసు నమోదు చేసింది. అయితే తాజాగా బాధితురాలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసిన జుబేర్ ఆమెకు వాట్సాప్ ద్వారా వాటిని పంపించాడు. కేసు వాపసు తీసుకోవాలని లేకుంటే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ బాధితురాలికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై మరోసారి ముంబై పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు జుబేర్‌తో పాటు ప్రజక్త, స్వీటీలపై ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటన హైదరాబాద్‌లో జరగడంతో ముంబై పోలీసులు బంజారహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారహిల్స్ పోలీసులు నిందితులు కోసం గాలిస్తున్నారు. (చదవండి : పేటిఎం పేరుతో మోసం.. లక్షల్లో స్వాహా) -
సినిమా డిస్ట్రిబ్యూటర్ అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: బాకీ వసూలు చేసుకొని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యమయ్యాడు. మూడు రోజులైనా జాడ లేకపోవడంతో అతడి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు.. బేగంపేట కు చెందిన వి.నగేష్(62) సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడకు చెందిన సజ్జుకు ఐదు లక్షల రూపాయలు బాకీ ఇచ్చాడు. అతడి నుంచి బాకీ వసూలు చేసుకునేందుకు ఈనెల 6న ఇంటి నుంచి బయల్దేరాడు. అదే రోజు రాత్రి 10.30 గంటల నుంచి నగేష్ ఫోన్ నంబర్‌కు కుటుంబ సభ్యులు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది.(చదవండి: ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం) ఈ క్రమంలో నగేష్ కుమార్తె సింధూజ సజ్జు కార్యాలయానికి వెళ్లి తండ్రి గురించి ఆరా తీసింది. అక్కడ తండ్రి పాదరక్షలు, ద్విచక్ర వాహనం కనిపించినా, మనిషి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. -
పథకం ప్రకారం రప్పించి, బంధించి..!
-
దిండుతో నొక్కి చంపేశారు!
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్ హత్య పక్కా పథకం ప్రకారం జరిగిందేనని పోలీసులు తేల్చారు. హత్యచేయాలన్న ఉద్దేశంతోనే ‘హనీ ట్రాప్’ద్వారా పిలిపించిన రాకేష్‌రెడ్డి తదితరులు కొన్ని బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని ఆపై దిండుతో ముఖంపై నొక్కి హతమార్చారని తెలిసింది. దాదాపు 11 మంది పోలీసులతో సంబంధాలు కలిగి ఉన్న రాకేష్‌రెడ్డి వారితో పాటు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అనేక మందిని బెదిరించి డబ్బు కాజేసినట్లు, మోసాలకు పాల్పడినట్లు తేలింది. గురువారం సికింద్రాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే బాధితుడు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, జయరామ్ హత్య కేసుకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. గురువారం సాయంత్రానికి రాకేష్, శ్రీనివాస్‌లతో పాటు విశాల్, రౌడీషీటర్ నగేష్‌ల పాత్రలపై ఆధారాలు లభించాయని తెలిసింది. మరోపక్క ఈ కేసులో శిఖాచౌదరిని దాదాపు 7 గంటల పాటు విచారించిన పోలీసులు.. రాత్రి 8 గంటలకు ఆమెను విడిచిపెట్టారు. అసలు జయరాంకు డబ్బు ఇచ్చాడా? ఈ ఘటనకు ప్రధాన కారణం రాకేష్‌రెడ్డి, జయరామ్ మధ్య ఉన్న ఆర్ధిక వివాదాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తేల్చారు. 2016–18 మధ్య రాకేష్ పలు దఫాల్లో జయరామ్‌కు రూ.4.17 కోట్లు ఇచ్చాడని, ఇందులో రూ.80లక్షలు ఒకసారి, 40లక్షలను రెండుసార్లు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశాడని వెల్లడించారు. ఇదే విషయాన్ని నిందితుల అరెస్టు నేపథ్యంలో విడుదల చేసి అధికారిక ప్రెస్‌నోట్‌లోనూ పొందుపరిచారు. అయితే కేసు జూబ్లీహిల్స్‌కు బదిలీ అయిన తర్వాత నిందితులను విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులకు ఈ ఆర్థికలావాదేవీలకు సంబంధించి ఆధారాలేవీ లభించలేదు. దీంతో గురువారం శిఖా చౌదరిని సైతం పోలీసుస్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఆర్థిక లావాదేవీలపై ప్రాథమిక ఆధారాలు సైతం లభించకపోవడం, రాకేష్ సరైన వివరాలు వెల్లడించకపోవడంతో పోలీసులు జయరామ్ బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. వీటిలో కూడా ఎక్కడా ఆ స్థాయిలో లావాదేవీలు లేవని భావిస్తున్నారు. దీంతో హత్య వెనుక మరేదైనా కారణం ఉందా? లేక జయరాం ఆస్తిని కాజేయడానికి బెదిరిస్తూ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దిండుతో ముఖంపై ఒత్తి పెట్టడంతో! రాకేష్ రెడ్డి తదితరులు గత 31వ తేదీ ఆర్థిక లావాదేవీల విషయమై జయరామ్‌తో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో వీరు జయరామ్‌పై దాడి చేయడంతో ఆయన కూర్చున్న ప్రాంతంలోనే పడిపోయారు. అనంతరం దిండుతో జయరామ్ ముఖంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత మృతదేహాన్ని శ్రీనివాస్ సాయంతో జయరామ్ కారులోకి మార్చి రాకేష్ ఒక్కడే దాదాపు 5గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ 11 మంది పోలీసులతో మాట్లాడాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గురువారం రాకేష్ ఇంట్లో క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. కస్టడీలో ఉన్న నిందితులతో పాటు కొత్తగా పట్టుకున్న వారినీ తీసుకువెళ్లి క్లూస్ టీమ్ సమక్షంలో దీన్ని చేపట్టారు. ఈ తతంగం దాదాపు 40 నిమిషాలు జరిగింది. మరోపక్క రాకేష్ రెడ్డి బ్యాంక్ అకౌంట్‌ను స్తంభింపజేసిన అధికారులు సెల్ఫోన్లు, రెండు కార్లను, ఇంటిని సైతం సీజ్ చేశారు. జయరామ్ హత్య కేసులో శిఖాచౌదరితోపాటు మరో నలుగురిని విచారించామని పోలీసులు తెలిపారు. జయరామ్ కంపెనీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నామని, కొన్ని పత్రాలు కూడా తెప్పించి పరిశీలించామన్నారు. నాలుగున్నర కోట్లు జయరామ్‌కి అప్పు ఇచ్చే స్థోమత రాకేశ్‌కు ఉందా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతోందన్నారు. అవసరమైతే శిఖాచౌదరిని మరింత లోతుగా విచారిస్తామన్నారు. పలువురు పోలీసు అధికారులపై కూడా ఆరోపణలున్నాని వీటినీ పరిశీలిస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కోస్టల్ బ్యాంకు ఉద్యోగులను కూడా విచారిస్తామని పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం రప్పించి, బంధించి..! ఏపీ పోలీసుల విచారణలో రాకేష్‌రెడ్డి ఈ హత్య జరిగిన తీరును వివరిస్తూ.. అనుకోని పరిస్థితుల్లో జరిగిన పెనుగులాటతో జయరామ్ చనిపోయాడని, తనతో పాటు తన వాచ్‌మన్ శ్రీనివాస్‌కు మాత్రమే ఇందు లో ప్రమేయం ఉందని చెప్పాడు. దీన్నే అధికారులు కూడా నిర్ధారించారు. అయితే తెలంగాణ విచారణలో అనేక కొత్త విషయా లు బయటకొస్తున్నాయి. జయరామ్‌ను ‘హనీ ట్రాప్’ చేయడం కోసం రాకేష్‌రెడ్డి తన స్నేహితుడైన జూనియర్ ఆర్టిస్ట్ సూర్యను వినియోగించుకున్నాడని వెల్లడైంది. అతడి తో గత నెల 29 రాత్రి జయరామ్‌కు ఫోన్ చేయించిన రాకేష్.. ఓ యువతి విషయం చర్చించేలా చేశాడు. దీంతో మరుసటి రోజు జయరామ్ స్వయంగా ఆ జూనియర్ ఆర్టిస్ట్ కు కాల్ చేశారు. దీంతో జయరాంను తీసు కుని తన ఇంటికి రావాల్సిందిగా ఆర్టిస్ట్‌కు రాకేశ్ సూచించాడు. జయరాంను ఇంటికి తీసుకొచ్చే సమయానికే.. రాకేష్ ఇంట్లో వాచ్‌మన్ శ్రీనివాస్‌తోపాటు ఎస్సార్‌నగర్ రౌడీషీటర్ నగేష్, విశాల్ అనే మరో వ్యక్తి ఉన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ నుంచి వెళ్లిపోగా.. మిగిలిన వారు జయరామ్‌ను బలవంతంగా లోపలకు తీసుకువెళ్లారు. 30, 31 తేదీల్లో జయరామ్‌ను ఆ ఇంట్లోనే నిర్బంధించి డ బ్బు కోసం అనేక మందికి ఫోన్లు చేయిం చారు. బలవంతంగా 10 ఖాళీ బాండ్ పేపర్ల పై సంతకాలు చేయించుకున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల కోసం సిరిసిల్లకు చెందిన గడ్డం శ్రీను, అంజిరెడ్డి, చొక్కారామ్లు రాకేశ్ ఇంటికి వచ్చారు. అక్కడ వీరికి జయరామ్ తారసపడినా.. ఏమీ మాట్లాడలేదని తెలిసింది. పోలీసులు గురువారం సూర్యను అదుపులోకి తీసుకుని విచారించారు. -
ఐపాడ్ ఆర్డర్ చేస్తే పాత సాక్సులు..
హైదరాబాద్: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా ఐపాడ్ ను ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్ లో రాళ్లు, పాతబడ్డ సాక్సులు వచ్చాయి. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని కేర్ అవుట్ పేషంట్ విభాగంలో పని చేస్తున్న సీహెచ్ సందీప్.. గత నెల 30వ తేదీన ఐపాడ్ కోసం ఆన్లైన్లో ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాడు. ఇందుకోసం రూ.6064 చెల్లించాడు. సోమవారం ఉదయం డెలివరీ బాయ్ వచ్చి పార్శిల్ ఇచ్చాడు. బాయ్ వెళ్లిపోయిన తర్వాత పార్శిల్ తెరిచి చూడగా.. అందులో రాళ్లు, పాతబడ్డ సాక్సులు కనిపించాయి. మోసపోయానని తెలుసుకొని బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది, డెలివరీ బాయ్ ఎవరు, ఫోన్ నంబర్, తదితర ఆధారాలతో పాటు సీసీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి మోసాలు వెలుగుచూసిన సమయంలో ఆయా ఆన్ లైన్ సంస్థలు మోసాలకు పాల్పడిన డెలివరీ బాయ్స్, మధ్య వర్తులపై తీవ్ర చర్యలు తీసుకున్నాయి.(చదవండి: 'ఆన్లైన్'లో ఇంత మోసమా!)