
సాక్షి, హైదరాబాద్: బాకీ వసూలు చేసుకొని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ అదృశ్యమయ్యాడు. మూడు రోజులైనా జాడ లేకపోవడంతో అతడి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు.. బేగంపేట కు చెందిన వి.నగేష్(62) సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడకు చెందిన సజ్జుకు ఐదు లక్షల రూపాయలు బాకీ ఇచ్చాడు. అతడి నుంచి బాకీ వసూలు చేసుకునేందుకు ఈనెల 6న ఇంటి నుంచి బయల్దేరాడు. అదే రోజు రాత్రి 10.30 గంటల నుంచి నగేష్ ఫోన్ నంబర్‌కు కుటుంబ సభ్యులు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది.(చదవండి: ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం)
ఈ క్రమంలో నగేష్ కుమార్తె సింధూజ సజ్జు కార్యాలయానికి వెళ్లి తండ్రి గురించి ఆరా తీసింది. అక్కడ తండ్రి పాదరక్షలు, ద్విచక్ర వాహనం కనిపించినా, మనిషి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment