ఐపాడ్ ఆర్డర్ చేస్తే పాత సాక్సులు..
ఐపాడ్ ఆర్డర్ చేస్తే పాత సాక్సులు..
Published Mon, Nov 7 2016 7:38 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
హైదరాబాద్: ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా ఐపాడ్ ను ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్ లో రాళ్లు, పాతబడ్డ సాక్సులు వచ్చాయి. హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని కేర్ అవుట్ పేషంట్ విభాగంలో పని చేస్తున్న సీహెచ్ సందీప్.. గత నెల 30వ తేదీన ఐపాడ్ కోసం ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాడు. ఇందుకోసం రూ.6064 చెల్లించాడు. సోమవారం ఉదయం డెలివరీ బాయ్ వచ్చి పార్శిల్ ఇచ్చాడు. బాయ్ వెళ్లిపోయిన తర్వాత పార్శిల్ తెరిచి చూడగా.. అందులో రాళ్లు, పాతబడ్డ సాక్సులు కనిపించాయి. మోసపోయానని తెలుసుకొని బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది, డెలివరీ బాయ్ ఎవరు, ఫోన్ నంబర్, తదితర ఆధారాలతో పాటు సీసీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి మోసాలు వెలుగుచూసిన సమయంలో ఆయా ఆన్ లైన్ సంస్థలు మోసాలకు పాల్పడిన డెలివరీ బాయ్స్, మధ్య వర్తులపై తీవ్ర చర్యలు తీసుకున్నాయి.(చదవండి: 'ఆన్లైన్'లో ఇంత మోసమా!)
Advertisement