బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ బయటపడటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్‌లో డ్రగ్స్ (కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్‌లోని యువతీ యువకులు డ్రగ్స్‌ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో 145 మందిని పంపివేయగా పోలీసుల అదుపులో ప‍్రస్తుతం ఐదుగురు ఉన్నారు.
అయితే ఈ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును పలు ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని నటి హేమ మండిపడ్డారు. తన గురించి అవాస్తవాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు 'నేను అసలు పబ్‌కు వెళ్లలేదు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ కొందరు కావాలనే నా పేరును ప్రసారం చేస్తున్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే ఇక్కడికి వచ్చాను.' అని హేమ మీడియాతో తెలిపారు. కాగా పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో పబ్‌లో ఉన్న ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, నిహారికతోపాటు పలువురు ప్రముఖుల పిల్లల్ని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment