హైదరాబాద్‌లో ముంబై యువతిపై దారుణం | Mumbai Young Women Molested By Person In Hotel In Hyderabad | Sakshi
Sakshi News home page

ముంబై యువతిపై దారుణం.. మద్యం తాగించి

Published Tue, Oct 13 2020 3:42 PM | Last Updated on Tue, Oct 13 2020 4:45 PM

Mumbai Young Women Molested By Person In Hotel In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ​ హోటల్‌లో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతికి మద్యం తాగించి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మే నెలలో చోటుచేసుకుంది. తాజాగా ఆమెపై అత్యాచారాయత్నానికి పాల్పడిన యువకుడు బాధితురాలికి వాట్సప్‌ ద్వారా న్యూడ్‌ వీడియోలు పంపించి బెదిరింపులకు పాల్పడ్డాడు.(చదవండి : శ్వేతను అజయే పట్టాల దగ్గరకు తీసుకెళ్లాడు’)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ప్రజక్త అనే యువతి క్రిష్ణ చౌదరి ద్వారా బాధితురాలికి ముంబైలో పరిచయమైంది. అన్షూ కుక్రేజా అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని.. అతని కంట పడకుండా బాధితురాలి ఇంట్లో ఉంటానని ప్రజక్త రిక్వెస్ట్‌ చేసింది. ప్రజక్త రిక్వెస్ట్‌ను అంగీకరించిన బాధితురాలు ఆమెకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించింది. కాగా మే10న స్వీటీ అనే యువతి ప్రజక్తకు ఫోన్‌ చేసి హైదరాబాద్‌లో జుబేర్‌ అనే మిత్రుడి బర్త్‌డే పార్టీ ఉందని తప్పక రావాలని పేర్కొంది. కాగా మే11న బాధితురాలితో కలిసి వచ్చిన ప్రజక్త.. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో బస చేశారు. అదే రోజు రాత్రి స్వీటీ, జుబేర్‌లు హోటల్‌కు వెళ్లి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. అనంతరం జుబేర్‌, ప్రజక్త, స్వీటీలు కలిసి బాధితురాలికి బలంవంతగా మద్యం తాగించారు. తర్వాత జుబేర్‌ బాధితురాలిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. అయితే ఆమె ప్రతిఘటించడంతో  స్వీటీతో కలిసి జుబేర్‌ హోటల్‌ నుంచి వెళ్లిపోయాడు.

కాగా మే14న ముంబైకి చేరుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జుబేర్‌పై కేసు నమోదు చేసింది. అయితే తాజాగా బాధితురాలు బట్టలు మార్చుకునేటప్పుడు వీడియోలు తీసిన జుబేర్‌ ఆమెకు వాట్సాప్‌ ద్వారా వాటిని పంపించాడు. కేసు వాపసు తీసుకోవాలని లేకుంటే వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ బాధితురాలికి ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై మరోసారి ముంబై పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు జుబేర్‌తో పాటు ప్రజక్త, స్వీటీలపై ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటన హైదరాబాద్‌లో జరగడంతో ముంబై పోలీసులు బంజారహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న  బంజారహిల్స్‌ పోలీసులు నిందితులు కోసం గాలిస్తున్నారు. (చదవండి : పేటిఎం పేరుతో మోసం.. లక్షల్లో స్వాహా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement