బోస్టన్: చైనాలో పుట్టి సుమారు 30 దేశాలకు వ్యాప్తి చెందిన కోవిడ్-19(కరోనా వైరస్)తోపాటు అన్ని రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పించేందుకు ఒక సార్వత్రిక వ్యాక్సిన్ తయారీకి మార్గం సుగమమైంది. ఆర్గోనాట్4 క్లుప్తంగా ఏజీఓ4 అని పిలిచే ఒక ప్రోటీన్ అన్ని వైరస్‌లను ఎదుర్కోగలదని మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రి శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. అనేక రకాలైన వైరస్‌ల నుంచి కణాలను రక్షించేందుకు ఏజీఓ4 ఉపయోగపడుతుందని, క్షీరదాల రోగ నిరోధక కణాల విషయంలో ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుందని ఈ శాస్త్రవేత్త కేట్ ఎల్.జెఫ్రీ తెలిపారు.
(చదవండి : ఓ చైనా మహిళ ఆవేదన : ప్రపంచానికి సూటి ప్రశ్న!)
Comments
Please login to add a commentAdd a comment