టమాట కెచప్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. బయట రెస్టారెంట్లలో, హోటళ్లలో ప్రధానమైనది ఈ కెచప్. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చాక అందరూ ఈ టమాట సాస్‌లకు అలవాటు పడిపోయారు. ఐతే ఇక ఆ టమటా కెచప్ తయారు చేయడం కష్టమైపోతుందంటున్నారు వాతావరణ పరిశోధకులు. అందుకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు. ఈ అధిక ఉష్టోగ్రతలు కారణంగా టమాట పంట ఉండదేమోనని భయపడుతున్నారు కూడా.
ఇటీవల అధిక ఉష్ణోగ్రతలు కారణంగా కూరగాయాల ధరలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. అందులోనూ టమాట ధర ఇటీవల కనివినీ ఎరుగని రీతిలో ఆకాశన్నంటింది. ఇందంతా ఒకత్తెయితే ఇక రాను రాను ఈ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే ఇక టమాట ఉత్పత్తి తగిపోతుందని వాతావరణ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ మేరకు డెన్మార్క్‌లోని ఆర్హస్ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం పెరుగుతున్న ఉష్ణోగ్రత టమాటల ఉత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఒక గణిత నమూనాను రూపొందించింది కూడా.
ఇప్పటివరకు ఇటలీ, చైనా మరియు కాలిఫోర్నియా టమాట ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయని పరిశోధకులు బృందం పేర్కొంది. ఇవి ప్రపంచ ఉత్పత్తిలో ఈ దేశాలే అధికంగా సరఫరా చేస్తున్నాయి. ఐతే ఇప్పుడూ ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రమాదంలో ఉన్నాయని అధ్యయనం తెలిపింది. గణిత నమూనా ప్రకారం 2050 నుంచి 2100 మధ్యకాలంలో టమాట పంట సగానికి తగ్గిపోతుందని తెలిపింది.
2050 నాటికి టమాట ఉత్పత్తి ఆరు శాతం క్షీణిస్తుందని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు 2040 నుంచి 2069 మధ్య టమాట ఉత్పత్తి ప్రాంతాలలో సుమారు 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత ఉంటుందని తదుపరి 30 సంవత్సరాలలో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదల ఉంటుందని వెల్లడించింది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదలను 1980 నుంచి 2009 మధ్య కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను బట్టి పరిశోధకులు అంచనావేశారు.
పదకొండు అతి పెద్ద సాగు పంటల్లో ఒకటైన ఈ టమాట పంట ప్రస్తుతం 14 మిలియన్ల టన్నుల నుంచి 7 మిలియన్ల టన్నులకు పడిపోతోంది. గతేడాది కూడా మార్చి నుంచి ఏప్రిల్ నెలల్లో పాకిస్తాన్, భారత్ వంటి దేశాల్లో టమాట పంట దారుణంగా పడిపోయింది. ఇలా టమటాల ఉత్పత్తి దారుణంగా పడిపోతే టమాట కెచప్, టమాట పేస్ట్ వంటివి ఇక ఉండవేమో అంటున్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: మంటల్లో వేసినా కాలిపోని పుస్తకం...వేలంలో ఎంత పలికిందంటే..?)
Comments
Please login to add a commentAdd a comment