నిలబడండి!
హూస్టన్: వీలైనప్పుడల్లా రోజుకు ఆరు గంటలు నిలబడితే స్థూలకాయం సమస్య నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువగా కూర్చోవడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యాలు తప్పవంటున్నారు. అమెరికన్ కేన్సర్ సొసైటీ శాస్త్రవేత్త డాక్టర్ కెరెం షువాల్ నేతృత్వంలోని బృందం.. నిలబడే అలవాట్లకు, జీవక్రియలు, స్థూలకాయానికి మధ్య సంబంధం తెలుసుకునేందుకు 7 వేల మంది రోగులను పరిశీలించారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), శరీర కొవ్వు శాతం, నడుం కొలత వంటి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని నిలబడే సమయానికి సూల్థకాయాన్ని మధ్య సంబంధాన్ని లెక్కించారు.
దాదాపు ఆరుగంటలు నిలబడే పురుషుల్లో 32 శాతం శరీర కొవ్వు శాతం తగ్గే అవకాశాలున్నాయని వర్సిటీ ఆఫ్ టెక్సాస్, జార్జియా వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. అదే మహిళల్లో అయితే ఆరుగంటలు నిలబడితే 47 శాతం కొవ్వు తగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.