మరణ సమయాన్ని గుర్తించొచ్చు!
న్యూయార్క్: మృతదేహంలోని కొన్ని బ్యాక్టీరియాల ఆధారంగా చనిపోయిన సమయాన్ని కచ్చితంగా తెలిపే నూతన పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మృత దేహంలోని నైక్రోబయోమ్ బ్యాక్టీరియా ను పరీక్షించి మరణించిన సమయాన్ని స్పష్టంగా చెప్పవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని సిటీ యూనివర్సిటీ (సీయూఎన్ వై)కి చెందిన పరిశోధకులు మానవుడి దేహంలోని నైక్రోబయోమ్‌లు, పలు సూక్ష్మజీవులపై పరిశోధన నిర్వహించారు. కుళ్లిపోయిన 21 మృతదేహాల చెవి, నాసికానాళంలోని నమూనాలను సేకరించి మెటాజెనామిక్ డీఎన్ఏ అనుక్రమణం ద్వారా పరిశీలించినట్లు నాథన్ హెచ్ లెంట్స్ అనే శాస్త్రవేత్త చెప్పారు.