City University
-
హలో.. నేనండీ.. మీకిష్టమైన గొంగళిపురుగును!!
చీ..యాక్.. ఇదేగా మీ ఎక్స్ప్రెషన్.. గొంగలి పురుగు అంటేనే పరమ అసహ్యం కదా మనకు.. అయితే.. మరి ఈ గొంగలి పురుగు ఎందుకిలా అంటోంది.. మనతో తన గురించి ఏం చెప్పాలనుకుంటోంది.. ఓసారి దాని నోటనే వినేద్దామా.. హాయ్.. నేనండీ.. గొంగళి పురుగును.. మీరు బయట చూసే గొంగళి పురుగును కాను.. రోబో గొంగళి పురుగును! నన్ను హాంకాంగ్‌కు చెందిన సిటీ యూనివర్సిటీ వాళ్లు తయారు చేశారు. పీడీఎంఎస్ అనే ఓ టైపు సిలికాన్ పదార్థంతో రూపొందించారు. నా గురించి చెప్పుకోవాలంటే అబ్బో.. చాలానే ఉంది. గొప్పలు కాదు గానీ.. నేను బలంలో భీముడి టైపు. కరెక్టుగా చెప్పాలంటే.. నా బరువుకన్నా 100 రెట్ల బరువును మోయగలను. అంటే.. నా అంత బలముంటే ఓ మనిషి.. ఓ మినీ బస్సును అవలీలగా ఎత్తేయగలడన్నమాట. ఇంతకీ నన్ను ఎందుకు తయారుచేశారో చెప్పలేదు కదూ.. మీకోసమే.. అవును.. కేవలం మీ కోసమే.. నేను మీపాలిట చిన్నపాటి డాక్టర్నే. మీ కొచ్చే రకరకాల ఆరోగ్య సమస్యలకు నేనే పరిష్కారం చూపుతాను. నా ఈ చిన్ని కాళ్లు ఉన్నాయి చూశారూ.. మీరు నిజంగా వాటికి మొక్కాల్సిందే. ఎందుకంటే.. వీటి సాయంతోనే నేను మీ శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లిపోగలను.. అక్కడ శోధించేసి.. రోగ కారణాన్ని కనిపెట్టడంలో వైద్యులకు సాయం చేయగలను. అంతేనా.. కావాల్సిన మందులను వీటితోనే పట్టుకెళ్లి.. సమస్య ఉన్నచోట వాటిని విడిచిపెట్టి రాగలను. అంటే.. సమస్య ఎక్కడో చికిత్స అక్కడన్నమాట. దీని వల్ల మందు మరింత బాగా పనిచేస్తుందన్న విషయం మీకు తెలిసిందే. మీకెంత లాభమో కదా.. నేను రక్తం, శ్లేష్మం ఇలా ఎందులో నుంచైనా వెళ్లిపోతా.. నా శరీర మందం 0.15 మిల్లీ మీటర్లే. నన్ను ఎలక్ట్రో మాగ్నటిక్ శక్తి ద్వారా వైద్యులు బయట నుంచి నియంత్రిస్తారు. ఇంతేకాదు.. త్వరలో నాకు మరిన్ని అదనపు హంగులూ అమర్చనున్నారట. రకరకాల ఆకారాల్లో కట్ చేసి.. వినియోగించేలా నన్ను మార్చనున్నారట. పనిపూర్తయ్యాక.. అక్కడే శరీరంలోనే కరిగిపోయేలా చేయాలని కూడా యోచిస్తున్నారట. నా టాలెంట్ ఏమిటో మీకు తెలియాలంటే ముందుగా మీరు నన్ను మింగాల్సి ఉంటుంది.. లేదంటే.. మీ శరీరాన్ని కోసి.. లోపలికి పంపిస్తారు.. ఏది బెటరో మీ ఇష్టం. వెళ్లేముందు ఒక్క మాట.. చూడ్డానికి నేను గొంగలి పురుగునే.. కానీ జబ్బు పడ్డ మీ జీవితాన్ని అందమైన సీతాకోక చిలుకలాగ మార్చగలను.. ఉండనా మరి.. టాటా.. బైబై.. -
మరణ సమయాన్ని గుర్తించొచ్చు!
న్యూయార్క్: మృతదేహంలోని కొన్ని బ్యాక్టీరియాల ఆధారంగా చనిపోయిన సమయాన్ని కచ్చితంగా తెలిపే నూతన పద్ధతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. మృత దేహంలోని నైక్రోబయోమ్ బ్యాక్టీరియా ను పరీక్షించి మరణించిన సమయాన్ని స్పష్టంగా చెప్పవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని సిటీ యూనివర్సిటీ (సీయూఎన్ వై)కి చెందిన పరిశోధకులు మానవుడి దేహంలోని నైక్రోబయోమ్లు, పలు సూక్ష్మజీవులపై పరిశోధన నిర్వహించారు. కుళ్లిపోయిన 21 మృతదేహాల చెవి, నాసికానాళంలోని నమూనాలను సేకరించి మెటాజెనామిక్ డీఎన్ఏ అనుక్రమణం ద్వారా పరిశీలించినట్లు నాథన్ హెచ్ లెంట్స్ అనే శాస్త్రవేత్త చెప్పారు. -
మెసేజ్‌లే కాదు ముద్దులూ పంపుకోవచ్చు!
లండన్: ఎక్కడో ఉన్న ప్రియురాలికి/భార్యకు మెసేజ్‌లు, మెయిల్స్‌లా ఇక నుంచి ముద్దులు పంపించుకోవచ్చు. దీనికోసం ‘కిసెంజర్’ అనే పరికరాన్ని లండన్ లోని సిటీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రూపొందించారు. ఇందులో ఒత్తిడిని గుర్తించే సెన్సార్లు, ప్రేరేపితాలు ఉంటాయి. ఈ పరికరాన్ని మనం ముద్దాడితే మన పెదాలు దానిపై ఎంత ఒత్తిడిని కలిగించాయో, అంతే ఒత్తిడిని అవతలి పరికరం ద్వారా మన భాగస్వామికి కలిగించవచ్చు. స్మార్ట్‌ఫోన్ కు అనుసంధానం చేసుకుని ముద్దులను పంపించుకోవచ్చు. -
అద్భుతం అంటే ఇదే....