మనుషుల్లా వ్యవహరించే గుణం ఇక రోబోల సొంతం
గేమ్ చేంజర్‌లుగా మారనున్న హ్యూమనాయిడ్ రోబోలు
అనుకోకుండా జరిగే ఘటనలపై సమయానుకూల స్పందన
దారిలో ఏదైనా అడ్డొస్తే తప్పుకుని వెళ్లేలా శిక్షణ
2 కోట్ల గంటల వీడియోల ద్వారా తర్ఫీదు
కృత్రిమ మేధలో కొత్త శకం
ఓ అధికారిగా దక్షిణ కొరియాలోని గుమి నగరంలో పనిచేసే రోబో మెట్ల మీదపడి చనిపోయింది అంటూ గత ఏడాది మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీనికి కారణం రియల్ లైఫ్‌లో అనుకోకుండా ఎదురయ్యే సంఘటనల పట్ల ఎలా స్పందించాలనే విషయం ఏఐ ఆధారిత రోబోలకు తెలియకపోవటమే. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా.. ఎదురుగా మెట్లు కనిపిస్తే మనుషుల్లాగా మెట్ల మీద నుంచి రోబోలు కిందకు దిగనున్నాయి.
అంతేకాకుండా దారిలో పోతుంటే రోడ్డు మధ్యలో గుంత ఉంటే దాని మీద నుంచి గెంతి ముందుకెళ్లేలా తర్ఫీదు పొందిన రోబోలు ఇక మీదట రోడ్ల మీద తిరగనున్నాయి. మనం అలసిపోయి ఇంటికి వెళ్లి టీ తయారుచేసి.. కొంచెం తక్కువ చక్కెర వేసి ఇవ్వమంటే అలాగే తయారుచేసి ఇవ్వనున్నాయి. –సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
కచ్చితమైన నావిగేషన్
హ్యూమనాయిడ్ రోబోట్ నావిగేషన్ వ్యవస్థను మరింతగా మెరుగుపరచనుంది. ఈ మానవరూప రోబోలు క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కచి్చతత్వంతో, మరింత పక్కాగా ముందుకు వెళ్లి పనులను నెరవేర్చే అవకాశం ఉంటుంది. అంటే రోడ్డుపై ఏదైనా అనుకోకుండా ఎదురుగానో.. పక్కనుంచో వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తే అందుకు అనుగుణంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ముందుకు వెళ్లేలా రూపుదిద్దుకోనున్నాయి.
వాటికి ఉండే కెమెరాలు, రాడార్లు, వివిధ సెన్సార్ల ద్వారా వాస్తవ పరిస్థితులను పక్కాగా అంచనా వేసుకుని.. మెదడు వలే విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్లనున్నాయి. తద్వారా ఏఐ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మరింత సులభంగా రోడ్లపై సంచరించనున్నాయి. ఈ రోబోలు భౌతిక ప్రపంచంలోకి అడుగు పెట్టకముందే వర్చువల్ పరిసరాలతో శిక్షణ పొంది ఉండటం వల్ల మర మనుషులు మరింత తెలివిగా నిజ జీవిత సవాళ్లను సులభంగా ఎదుర్కొనే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉదాహరణకు.. కాస్మోస్ ఏఐతో కూడిన హ్యూమనాయిడ్ రోబో ఓ గదిలో ఉండే ఫరి్నచర్, ఎదురుపడే వ్యక్తులను ఢీ కొట్టకుండా రద్దీగా ఉండే గదిలో నడవగలదు. గదిలో ఎక్కడైనా తడి ఉంటే.. అక్కడ గెంతి దాటనూ గలదు. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే సూక్ష్మమైన మార్పులను కూడా ఇది గుర్తించగలదని రూపకర్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. మర మనుషులకుండే ఈ సామర్థ్యాలతో ప్రధానంగా హోటల్, హాస్పిటల్, లాజిస్టిక్స్ పరిశ్రమల్లో విరివిగా వినియోగించుకునేందుకు దోహదపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అచ్చం మనుషుల మాదిరిగానే..
అచ్చం మనుషుల్లా రోజువారీ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల విషయాలను వర్చువల్‌గా రోబోలకు ఎదురయ్యేలా చేసి.. వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు. తద్వారా రోడ్డు మీద నడిచే సమయంలో మధ్యలో గుంత వస్తే.. దాటుకుని ముందుకు వెళ్లడం.. ఎవరైనా దారికి అడ్డువస్తే తప్పుకుని వెళ్లడం ఇలా అన్ని విషయాల్లో అప్పటికప్పుడు మనుషుల తరహాలో స్పందించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు.
ఏదైనా పరిశ్రమలో ఈ హ్యూమనాయిడ్ రోబోలను వినియోగిస్తే.. పనిచేస్తున్న సమయంలో సమస్య తలెత్తినా ప్రత్యేకంగా ఎటువంటి ఆదేశాలు అవసరం లేకుండానే వెంటనే అది పరిష్కరించుకుని ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడనుంది. అంతేకాకుండా ఆస్పత్రుల్లో ఏదైనా ఆపరేషన్ చేసే సమయంలో కూడా అకస్మాత్తుగా సమస్య తలెత్తితే కూడా పరిష్కరించుకునే విధంగా వీటిని తయారు చేస్తున్నారు.
హోటల్స్‌లో మనం చెఫ్‌కు ‘ఆమ్లెట్ విత్ లెస్ స్పైసీ’ ఆర్డర్ ఇచ్చినట్టుగానే.. రోబోకు సైతం మనకు ఇష్టం నచ్చిన రుచుల్లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఆ రోబో మనం ఇచ్చే ఆర్డర్‌కు అనుగుణంగా వంటకాలను తయారుచేసి అందించేస్తుందన్న మాట.
సిద్ధమైన హ్యూమనాయిడ్ రోబో
రోబోలు సైతం మనసున్న మనుషుల్లాగే అనుకోకుండా జరిగే ఘటనలకు మనుషుల తరహాలోనే స్పందించే విధంగా తయారవుతున్నాయి. ఇటువంటి హ్యూమనాయిడ్ రోబోలను నివిదియా సీఈవో జెన్‌షెన్ హుయాగ్ సిద్ధం చేశారు. గత నెలలో లాస్ వేగాస్‌లో జరిగిన సీఈఎస్–2025లో తన హ్యూమనాయిడ్ రోబో పరిశోధనలను ఆయన వివరించారు.
ఏదైనా పనిచెబితే.. అప్పటికప్పుడు చేయడంతో పాటు నిజజీవితంలో ఎదురయ్యే వివిధ ఘటనల పట్ల శిక్షణ ఇచి్చనట్టు ఆయన తెలిపారు. ఫిజికల్ డైనమిక్ థింగ్స్.. ఫిజికల్ వరల్డ్‌ను అర్థం చేసుకునేందుకు వీలుగా 20 మిలియన్ గంటల (2 కోట్ల గంటల) వీడియోల ద్వారా హ్యూమనాయిడ్ రోబోకు శిక్షణ అందించినట్టు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment