సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా రజనీ నటన, శంకర్ టేకింగ్‌లకు దీటుగా ఇందులో చిట్టి: ది రోబో అందరినీ ఆకట్టుకుంది. అచ్చంగా అలాంటి హ్యుమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నట్టు ఇప్పటికే ఎలాన్ మస్క్ ప్రకటించాడు. కాగా ఈ రోబోకి సంబందించిన బిగ్ అనౌన్స్‌మెంట్ మరో మూడు నెలల్లో వినబోతున్నట్టు మస్క్ తెలిపారు.
హ్యుమనాయిడ్ రోబో
ఎలాన్ మస్క్ సంప్రదాయ వ్యాపార సూత్రాలకు భిన్నంగా ఆది నుంచి టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలతోనే ప్రపంచంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొందుతున్నాడు. ప్రపంచ నంబర్ వన్ కుబేరుడిగా గుర్తింపు పొందాడు. పేపాల్ మొదలైన ప్రస్థానం స్పేస్‌ఎక్స్, టెస్లాల మీదుగా ట్విటర్ టేకోవర్ వరకు వచ్చి చేరింది. ఈ మధ్యలో సీక్రెట్ ఆపరేషన్‌గా హ్యుమనాయిడ్ రోబోని డెవలప్‌చేసే పనులు మొదలెట్టాడు ఎలాన్ మస్క్. తొలిసారిగా ఈ విషయాన్ని 2021 ఆగస్టులో బయటి ప్రపంచానికి అధికారికంగా వెల్లడించాడు మస్క్.
సెప్టెంబరు 30న
ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఎలన్ మస్క్ మాట్లాడుతూ తన హ్యుమనాయిడ్ రోబోకి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఈ రోబోకు ఆప్టిమస్‌గా పేరు పెట్టినట్టు వివరించారు. టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డేను పురస్కరించుకుని 2022 సెప్టెంబరు 30న ఈ రోబోను ఆవిష్కరిస్తామంటూ మస్క్ వెల్లడించాడు.
ఫీచర్లు
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ఆరు అడుగుల ఎత్తు ఉండే ఆప్టిమస్ హ్యుమనాయిడ్ రోడో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడవగలదు. 68 కేజీలకు వరకు బరువులను ఎత్తగలదు. మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీల్లో కొన్ని పనులు అవలీలగా చేయగలదు. డేంజరస్ టాస్క్‌లో ఆప్టిమస్ అద్భుతమై సేవలు అందివ్వగలదు. అదే విధంగా టెస్లా కారుతో సైతం ఈ రోబోలు అనుసంధానించబడి ఉంటాయి. పూర్తి వివరాల కోసం సెప్టెంబరు 30 వరకు వేచి చూడాల్సిందే.
చదవండి: ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్!
Comments
Please login to add a commentAdd a comment