వాషింగ్టన్: అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి హ్యూమనాయిడ్ రోబో.. రోబోనాట్-2(ఆర్2)కు ఈ ఏడాదికి గాను ‘నాసా ఇన్‌వెన్షన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. ఐఎస్‌ఎస్‌లోకి 2011లోనే చేరిన రోబోనాట్-2 అత్యాధునిక టెక్నాలజీలతో పనిచేస్తూ వ్యోమగాములకు సాయం చేస్తోంది. ఐఎస్‌ఎస్ చుట్టూ తిరుగుతూ మరమ్మతులు చేసేందుకు, స్పేస్‌వాక్ సందర్భంగా వ్యోమగాములకు సాయం చేసేందుకు కూడా దీనిని భవిష్యత్తులో సిద్ధం చేయనున్నారు.
జనరల్ మోటార్స్‌తో కలిసి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రూపొందించిన ఈ రోబో నాసా ఆవిష్కరణల్లో ఉత్తమంగా నిలిచిందని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. మనిషి మాదిరిగా ఐఎస్‌ఎస్‌లో సులభంగా కదులుతూ ఈ రోబో చేతులను రకరకాల పనులకు ఉపయోగించగలదని వారు తెలిపారు.
ఆర్2 టెక్నాలజీలకు ఇప్పటికే నాసా 39 పేటెంట్లను పొందిందని, మరికొన్ని పేటెంట్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, మనిషి మాదిరిగా ఉండే రోబోనాట్-1 రోబోను తొలుత తయారు చేసిన నాసా దానిని భూమి మీదే వివిధ ప్రయోగాలకు ఉపయోగించుకుంటోంది.
రోబోనాట్-2.. ఈ ఏటి మేటి నాసా ఆవిష్కరణ!
Published Mon, Jun 22 2015 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:08 AM
Advertisement
Advertisement