లండన్: ఆంగ్ల నిఘంటువు ఆక్స్‌ఫర్డ్‌లోకి ఈ ఏడాది కొత్తగా 900కి పైగా పదాలు, పదబంధాలు చేరాయి. తాజాగా విడుదలైన ఆక్స్‌ఫర్డ్ ఎడిషన్‌లోకి చేరిన పదాల్లో బెస్టీ (బెస్ట్ ఫ్రెండ్), బీట్‌బాక్సర్ (గొంతుతో సంగీత ధ్వనులు చేసేవారు), బుక్‌హాలిక్ (పుస్తకాల పురుగు), హీరోగ్రామ్ (పొగడటం) వంటి పదాలు ఉన్నాయి. అలాగే డెడ్ వైట్ మేల్ (రచయితలను తక్కువ చేసి చూపడం), క్రాప్ షూట్ (పాచికలతో జూదం), వాకడూ, వాకడూడుల్ (విపరీత మనస్తత్వం గలవారు) వంటి పదబంధాలు చేరాయి. తాజా ఎడిషన్‌లో చేరిన పదాల్లో పూర్తిస్థాయిలో అప్‌డేట్ చేసిన పదాలు ఎక్కువగా ఉండటం విశేషం. వెయ్యేళ్ల నుంచీ ఉపయోగిస్తున్న పదాలను, పదబంధాలను, వ్యాఖ్యలను, తాజాగా పుట్టే పదాలను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 1884 నుంచీ నిఘంటువులో చేర్చుతోంది.