
సోనియా తాలింపు.. మోదీ లాలింపు!
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిట్టిపోసిన మరుసటి రోజే ప్రధాని నరేంద్రమోదీ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు!
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌పై ప్రధాని ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తిట్టిపోసిన మరుసటి రోజే ప్రధాని నరేంద్రమోదీ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిం చారు! థరూర్ వాదనా పటిమ అద్భుతమని కొనియాడారు. గురువారమిక్కడ అంతర్జాతీయ అంశాలపై ఎంపీలకు అవగాహన కల్పించేందుకు స్పీకర్ ఆధ్యర్వంలో సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి థరూర్ ఒక్కరే హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇటీవలజరిగిన ఓ వేదికపై శశిజీ చాలా బాగా మాట్లాడారు.
యూట్యూబ్‌లో ఇది వైరస్‌లా పాకింది. ఆయన మాటలు భారతీయుల మనోభావాలకు అద్దం పట్టాయి’ అని అన్నారు. భారత్‌ను 200 ఏళ్లు పాలించినందుకు బ్రిటన్ తగిన పరిహారం చెల్లించాలని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ వేదికపై థరూర్ ఇటీవల డిమాండ్ చేశారు. మోదీ తనను పొగుడ్తున్న సమయంలో ముందు వరసలో కూర్చు న్న థరూర్.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.