
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ విరుగుడికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని, అది రోగి లోపలి రోగాన్ని నయం చేయడంతోపాటు కొన్నేళ్లపాటు ఆ రోగిలో రోగ నిరోధకశక్తి ఉండేలా చేస్తుందని ప్రొఫెసర్ సారా గిల్‌బర్ట్ గురువారం నాడు బ్రిటన్ ఎంపీలకు వివరించారు. కరోనా వైరస్ స్వల్ప లక్షణాలు కలిగిన వారికి ప్రస్తుతం జబ్బు నయం అయినా మరోసారి కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ఆ విషయంలో తమ వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తుందని, వాక్సిన్ వల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరిగి కొన్నేళ్ల పాటు అది శరీరంలో ఉండిపోతుందని, కరోనా మళ్లీ ఎప్పుడు దాడి చేసినా ఎదుర్కోగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. (మహారాష్ట్రలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదు)
వ్యాక్సిన్ తయారు చేసిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి సారా గిల్‌బర్ట్ నేతత్వం వహించారు. ఆ వ్యాక్సిన్ ఫార్ములా తీసుకొని ‘ఆస్ట్రా జెనికా’ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తోంది. ప్రాథమిక ట్రయల్స్‌ను ముగించుకున్న ఈ మందుపై తుది ట్రయల్స్ మొదలవుతున్నాయి. బ్రిటన్‌లో ఎనిమిది వేల మందిపై, బ్రెజిల్‌లో నాలుగు వేల మందిపై, దక్షిణాఫ్రికాలో రెండు వేల మందిపై ప్రయోగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ట్రయల్స్‌లో ఆక్స్‌ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ముందుంది. (చైనా యాప్స్ డిలీట్ చేయండి..మాస్క్ పొందండి)
45 మంది చొప్పున మూడు బృందాలపై తాము నిర్వహించిన వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయని ఆస్ట్రా జెనికాతో కలసి వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న పీవిజర్ లాబరేటరీకి చెందిన చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ ఫిలిప్ దార్‌మిడ్చర్ తెలిపారు. కరోనా సోకకుండా తమ వ్యాక్సిన్ అడ్డుకుంటుందా లేదా సోకిన తర్వాత నయం చేస్తుందా? అన్న సందేహం ఇంకా సందేహంగానే ఉండిపోయిందని ఆయన అన్నారు. (ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్)
Comments
Please login to add a commentAdd a comment