
ఆక్స్‌ఫర్డ్‌కు తొలి మహిళా వైస్ చాన్స్‌లర్
లండన్: బ్రిటన్‌లో అత్యంత ప్రాచీనమైన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వైస్ చాన్స్‌లర్ రాబోతున్నారు. ప్రస్తుతం సెయింట్ ఆండ్రూస్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ లూసీ రిచర్డ్‌సన్(56)ను ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ కాంగ్రెగేషన్ కమిటీ వచ్చే ఏడాది జనవరిలో తమ వైస్‌చాన్స్‌లర్‌గా నియమించనుంది.
800 ఏళ్ల చరిత్ర ఉన్న ఆక్స్‌ఫర్డ్ వైస్‌చాన్స్‌లర్ పదవిని చేపట్టనున్న తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కనున్నారు. తనకు ఈ అవకాశమివ్వడాన్ని గొప్పగా భావిస్తున్నానని రిచర్డ్‌సన్ చెప్పారు. రిచర్డ్‌సన్ విద్యారంగంలో గణనీయ కృషి చేశారని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ చాన్స్‌లర్ లార్డ్ పాటన్ కొనియాడారు.