ఆక్స్‌ఫర్డ్‌ పాఠాల్లో గాంధీ, లూథర్‌ కింగ్‌ | Mahatma Gandhi, Indian Independence Movement In Oxford Curriculum | Sakshi
Sakshi News home page

ఆక్స్‌ఫర్డ్‌ పాఠాల్లో గాంధీ, లూథర్‌ కింగ్‌

Published Mon, May 29 2017 10:03 AM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM

చారిత్రక అంశాలతో కూడిన చరిత్ర పేపర్‌ను తప్పనిసరి చేస్తూ ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ నిర్ణయం తీసుకుంది.

లండన్‌: భారత్‌తో పాటు ఆసియాలోని పలు చారిత్రక అంశాలతో కూడిన చరిత్ర పేపర్‌ను తప్పనిసరి చేస్తూ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. భారత జాతిపిత మహాత్మ గాంధీతో పాటు 1960లో అమెరికా నల్లజాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్‌ లూథర్‌కింగ్‌ గురించి పాఠ్యాంశాలను రూపొందించనున్నారు.

ప్రస్తుతం బ్రిటన్‌ చరిత్రపై ఉన్న రెండు పేపర్లకు అదనంగా డిగ్రీ(హిస్టరీ) విద్యార్థులు దీన్ని చదవాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలు తెలిపాయి.  ‘మా పాఠ్యాంశాలు జాతివివక్షతో ఎందుకున్నాయి’ అనే నినాదంతో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టపడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement