న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికైంది. స్టూడెంట్ యూనియన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో భారత సంతతి యువతి అన్వీ భుటానీ ఘన విజయం సాధించింది. ఆమె ప్రస్తుతం వర్సిటీలోని మ్యాగ్డలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతోంది. ఈ ఫలితాన్ని అధికారులు గురువారం రాత్రి ప్రకటించారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన వివాదం కారణంగా ఇంతకు ముందు ఉన్న ఆధ్యక్షురాలు రష్మీ సమంత్ రాజీనామా తర్వాత ఈ ఉపఎన్నిక జరిగింది.
భూటాని తన మ్యానిఫెస్టోలో.. చెర్వెల్ విద్యార్థి వార్తాపత్రిక ప్రకారం ఆక్స్ఫర్డ్ జీవన వేతనం అమలు చేయడం, సంక్షేమ సేవలు, క్రమశిక్షణా చర్యలను తొలగించడం లాంటివి చేర్చింది. 2021-22 విద్యా సంవత్సరానికిగాను స్టూడెంట్ యూనియన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్, రేసియల్ అవేర్‌నెస్, ఈక్వాలిటీ క్యాంపైన్ కో-చైర్ పదవి కోసం బరిలో నిలిచింది. దీంతో ఆమెకు భారీగా ఓట్లు పోలవడంతో ఏకపక్షంగా విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment