indian origin girl
-
శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
హూస్టన్: వర్జిన్ గెలాక్టిక్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అంతరిక్షంలో చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు సృష్టించింది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ షిప్లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్ బ్రాన్సన్తో 5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేసింది. ఈ ప్రయోగం 90 నిమిషాల పాటు సాగింది. ఈ షిప్లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీష ట్వీట్ చేశారు. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్రకు సంబంధించిన లైవ్‌ను యూట్యూబ్‌లో షేర్ చేసింది. శిరీషకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ అంతరిక్ష యాత్రను విజయవంతం చేసుకున్న శిరీషకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని రావడం రాష్ట్రానికి గర్వించదగ్గ క్షణమని సీఎం జగన్ పేర్కొన్నారు. Hon'ble CM Sri @ysjagan conveyed his best wishes to Guntur born aeronautical engineer Bandla Sirisha, flying on space flight Virgin Gailactic Unity 22. The CM said that it is a proud moment for the state and wished her good luck for the success of space mission. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 11, 2021 -
Oxford University: భారత సంతతి యువతి అరుదైన ఘనత
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా భారత సంతతి యువతి ఎన్నికైంది. స్టూడెంట్ యూనియన్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో భారత సంతతి యువతి అన్వీ భుటానీ ఘన విజయం సాధించింది. ఆమె ప్రస్తుతం వర్సిటీలోని మ్యాగ్డలెన్ కాలేజీలో హ్యూమన్ సైన్స్ చదువుతోంది. ఈ ఫలితాన్ని అధికారులు గురువారం రాత్రి ప్రకటించారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించిన వివాదం కారణంగా ఇంతకు ముందు ఉన్న ఆధ్యక్షురాలు రష్మీ సమంత్ రాజీనామా తర్వాత ఈ ఉపఎన్నిక జరిగింది. భూటాని తన మ్యానిఫెస్టోలో.. చెర్వెల్ విద్యార్థి వార్తాపత్రిక ప్రకారం ఆక్స్ఫర్డ్ జీవన వేతనం అమలు చేయడం, సంక్షేమ సేవలు, క్రమశిక్షణా చర్యలను తొలగించడం లాంటివి చేర్చింది. 2021-22 విద్యా సంవత్సరానికిగాను స్టూడెంట్ యూనియన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్, రేసియల్ అవేర్నెస్, ఈక్వాలిటీ క్యాంపైన్ కో-చైర్ పదవి కోసం బరిలో నిలిచింది. దీంతో ఆమెకు భారీగా ఓట్లు పోలవడంతో ఏకపక్షంగా విజయం సాధించింది. చదవండి: కొడుక్కి ఎంతైనా ఇస్తా.. కూతురికి ఇవ్వను! -
సెనెటర్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సారా గిడియాన్(48) అనే మహిళను మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదించారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో ఇది అత్యధిక పోటీ ఉండే సెనేట్ రేసుల్లో ఒకటి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల పేర్లను ఒబామా ప్రకటించారు. ఆ పేర్లలో భారత సంతతికి చెందిన సారా గిడియాన్ కూడా ఉన్నారు. 48 ఏళ్ల ఎంఎస్ గిడియాన్ ప్రస్తుతం మైనే స్టేట్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. రిపబ్లికన్ సెనేటర్ సుసాన్ కాలిన్స్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. సారా గిడియాన్‌ను అభ్యర్థిగా పెడితే ఆ సెనెటర్ స్థానం డెమొక్రటిక్ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన సెనెటర్ స్థానాల్లో మైనే రాష్ట్రం కూడా ఒకటి. ఇటీవల వచ్చిన పోల్స్ ఫలితాల్లో కూడా సారా గిడియాన్‌కు ఎక్కువ శాతం మంది మద్దతు తెలిపినట్టు తేలింది. కాల్సిన్కు 44 శాతం లీడ్ ఉండగా సారా గిడియాన్ పోటీతో అది 39 శాతానికి పడిపోయింది. గిడియాన్ తండ్రిది భారత్, తల్లిది అమెరికా. ఆలోచనాత్మక, అధిక అర్హత కలిగిన వారిని సెనెటర్ అభ్యర్థులుగా ఆమోదించడం గర్వంగా ఉందని ఒబామా ఈ సందర్భంగా విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఆమోదించిన అభ్యర్థులందరూ ప్రజల కోసం పాటుపడతారని ఒబామా అన్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుతం సెనెటర్‌గా వ్యవహరిస్తున్న సూసన్ కాలిన్స్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సారా ఒకవేళ నవంబర్‌లో ఎన్నికైతే అమెరికా సెనెట్‌కు ఎన్నికైన రెండో ఇండియన్ అమెరికన్ మహిళగా గుర్తింపు పొందుతారు. సారా గిడియాన్‌తో పాటు రిపబ్లికన్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఇండియన్ అమెరికన్స్ సెనెట్‌కు పోటీ చేస్తున్నారు. కాలిఫోర్నియా నుంచి మొట్టమొదటి సారి భారత సంతతి మహిళ అయిన కమలా హ్యారిస్ అమెరికా సెనేట్‌కు ఎన్నికయిన సంగతి తెలిసిందే. చదవండి: అన్నంత పని చేసిన ట్రంప్! -
దక్షిణాఫ్రికాలో ప్రకంపనలు రేపుతున్న భారతీయ చిన్నారి మృతి
-
అయ్యో సదియా.. దద్దరిల్లుతున్న డర్బన్
జోహెన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో తొమ్మిదేళ్ల భారత సంతతి చిన్నారి మరణం స్థానికుల్లో ఆగ్రహావేశాలను రగిల్చింది. కారు హైజాకర్ల దాడిలో చిన్నారి సదియా శుక్‌రాజ్ ప్రాణాలు విడిచింది. ఆగ్రహంతో స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయగా, అది కాస్త హింసాత్మకంగా మారింది. ప్రస్తుతం నిరసన ప్రదర్శనలతో డర్బన్ అట్టుడుకుతోంది. అసలేం జరిగింది.. ఛాట్స్వర్త్కు చెందిన సదియా శుక్‌రాజ్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో నాలుగో గ్రేడ్ చదువుతోంది. సోమవారం ఆమె తండ్రి శైలేంద్ర శుక్‌రాజ్ స్కూల్‌కు తీసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో ముగ్గురు దుండగులు ఆయుధాలతో వారి కారును అడ్డగించారు. సదియా తండ్రిని బయటకు లాగేసి, కారుతో వేగంగా ఉడాయించారు. చిన్నారి సాయంతో వారు అక్కడి నుంచి తప్పించుకోవాలని యత్నించారు. అయితే అది గమనించిన కొందరు స్థానికులు, సదియా తండ్రితో కలిసి హైజాకర్లపై కాల్పులు ప్రారంభించారు. ఆ కంగారులో కారు అక్కడే ఉన్న ఓ పార్క్‌లో దూసుకెళ్లి గోడను బలంగా ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. మొత్తం ముగ్గురు నిందితుల్లో ఒకడు అక్కడిక్కడే మృతి చెందగా, ఒకడిని అదుపులోకి తీసుకున్నారు. మరోకడు పరారీలో ఉన్నాడు. తీవ్రంగా గాయపడ్డ సదియాను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. అయితే ఆమె ఎలా చనిపోయిందన్న విషయాన్ని మాత్రం పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. బుల్లెట్ గాయంతో ఆమె చనిపోయిందా? లేక వాహనం బోల్తాపడిన క్రమంలో చనిపోయిందా? అన్నది తేలాల్సి ఉంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే సదియా మృతిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని క్వా జుల్-నాటల్ పోలీస్ కెప్టెన్ గ్వాలా స్పష్టం చేశారు. స్థానికుల ఆగ్రహం... డర్బన్‌లోని ఛాట్స్‌వర్త్ భారతీయ సంతతి జనాభా ఎక్కువగా ఉండే పట్టణం. ఈ మధ్య అక్కడ నేరాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సదియా ఉదంతం స్థానికులకు మరింత ఆగ్రహం తెప్పించింది. సుమారు 3 వేల మంది ఛాట్స్‌వర్త్ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. కేసులో త్వరగతిన దర్యాప్తు ముగించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులతో దురుసుగా ప్రవర్తించటంతో ఉద్రికత్తకు దారితీసింది. వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జీ, బాష్ఫవాయు గోళాలను పోలీసులు ప్రయోగించారు. 20 మందిని అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. దీంతో ఆందోళనలు డర్బన్ మొత్తం విస్తరించాయి. ఓవైపు సోషల్ మీడియా మొత్తం చిన్నారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి అంత్యక్రియల నేపథ్యంలో అల్లర్లు చెలరేగే పరిస్థితులు కనిపిస్తుండటంతో సంయమనం పాటించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. -
ఈ బాలికకు ఐన్‌స్టీన్ మించిన ఐక్యూ
లండన్: భారత సంతతికి చెందిన బాలిక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఐక్యూ(మేథ) పరీక్షల్లో అందరినీ ఆశ్చర్యపరిచేలా 162 పాయింట్లు సాధించింది. ఈ పాయింట్లు ప్రపంచ ప్రఖ్యాత మేథావులు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కంటే కూడా రెండు పాయింట్లు ఎక్కువే కావటం గమనార్హం. లండన్‌లోని చెషైర్ కౌంటీలో నివసించే ప్రవాస భారతీయుడు డాక్టర్ సూరజ్ కుమార్ పవార్ కుమార్తె రాజ్‌గౌరి పవార్. 18 ఏళ్లలోపు వారికి నిర్వహించే ఐక్యూ పరీక్షలో రాజ్‌గౌరి పాల్గొని అత్యధికంగా 162 పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో మెన్సా సంస్థ రాజ్గౌరిని తమ బ్రిటిష్ మెన్సా ఐక్యూ సొసైటీ సభ్యురాలిగా చేర్చుకుంది. స్కూల్లో టీచర్లు ఇస్తున్న ప్రోత్సాహంతోనే తమ కుమార్తె ఇంతటి ప్రతిభను చాటగలిగిందని బాలిక తండ్రి సూరజ్‌కుమార్ పవార్ తెలిపారు. సాధారణంగా 140 పాయింట్లు సాధించిన వారిని జీనియస్‌గా పరిగణిస్తామని మెన్సా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 20వేల మంది మాత్రమే ఇటువంటి ఘనతను సొంతం చేసుకున్నారని వివరించింది.