సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై ఆందోళన పెరుగుతున‍్న సమయంలో వ్యాక్సిన్‌పై ఆశలు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌పై సీరం ఇన్‌స్టిట్యూట్ కీలక విషయాన్ని ప్రకటించింది. 2021 జనవరి నాటికి తమవాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, బ్రిటీష్ సంస్థ ఆశ్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ 2021, జనవరి నాటికి భారత్‌లో లభిస్తుందని పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తాజాగా వెల్లడిచారు. ట్రయల్స్ విజయవంతమైన అనంతరం నియంత్రణ సంస్థల ఆమోదాలు సకాలంలో లభిస్తే వచ్చే ఏడాది జనవరి నాటికి టీకా భారత్‌లో లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. భారత్, యూకేలలో జరుగుతున్న పరీక్షల ఆధారంగా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా ఉంటుందనే నమ్మకముందని పేర్కొన్నారు. భారత మార్కెట్ కోసం కొవీషీల్డ్ పేరుతో వస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం దేశంలో రెండు, మూడు దశల పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫలితాలు వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ గురించి ప్రస్తావించిన అదర్ పూనావాలా కొవీషీల్డ్‌కు సంబంధించి తక్షణం ఆందోళన కలిగించే అంశాలేమీ లేవని, భారత్‌తో పాటు విదేశాల్లో వేలాది మంది ఈ వ్యాక్సిన్ షాట్ లభించిందని ఆయన తెలిపారు. ఇప్పటివరకైతే తమ సంస్థ 60 నుంచి 70 లక్షల మోతాదుల తయారీ లక్ష్యంగా ఉన్నట్టు, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక నెలకు కోటి మోతాదుల వ్యాక్సిన్‌లను తయారు చేయాలని భావిస్తున్నట్టు ఆయన వివరించారు. అంతేకాదు టీకా సరసమైన ధరకు టీకాను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వంతో సీరం చర్చలు జరుపుతోందన్నారు. అందరికీ అందుబాటులో ధరలో టీకాను అందించాలని నిశ్చయించుకున్నామని పూనావాలా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment