ముంబై: కరోనా వైరస్ కట్టిడికి ప్రపంచ వ్యాప్తంగా టీకాను కనుగొనడానికి అన్ని దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు ఏ ఫార్ములాతో కనుగొన్న మన దేశ దిగ్గజ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ పాత్ర ఉండాల్సిందే. ప్రపంచంలోనే భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సత్తా సీరమ్ సంస్థకు ఉంది. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ తయారీలో సీరం సంస్థ భాగస్వామ్యం ఉంది. సీరమ్ సంస్థ ప్రయోగాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య సాంకేతిక సలహాదారు కె విజయ్‌రాఘవన్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సీరమ్ సంస్థ వ్యాక్సిన్ ఉత్పత్తే లక్ష్యంగా 1966 సంవత్సరం పూణెలో నెలకోల్పిన విషయం తెలిసిందే.
వ్యాక్సిన్ ప్రయోగాలకు కావాల్సిన అన్ని సదుపాయాలను సీరం సంస్థకు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంస్థ చేస్తున్న ప్రయోగాలను ఉమేష్ శాలిగ్రామ్ అనే సీనియర్ శాస్త్రవేత్త పర్యవేక్షిస్తున్నారు. వ్యాక్సిన్ ప్రయోగ పురోగతిని ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తమ సంస్థ కేవలం కరోనా నియంత్రణకు మాత్రమే కాకుండా రాబోయే వైరస్‌లను ఊహించి అందుకనుగుణంగా నూతన వ్యాక్సిన్‌ల ఉత్పత్తి కూడా చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment