సాధారణంగా పెరుగుతున్న వయసుకు తగ్గట్టుగా ఓ మనిషి బలంగా ఉండటం అంత తేలిక కాదు.. ముఖ్యంగా యవ్వన దశ దాటి పోయిన తర్వాత ఓ స్థాయి వరకు స్థిరంగా ఉండి ఆ వెంటనే తిరోగమన దశ మొదలవుతుంది. అయితే, కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రం ఓ మనిషి బలంగా, మంచి రోగ నిరోధక శక్తిని కలిగి ఎలాంటి జబ్బులకు లోను కాకుండా ఉంటాడట. ఇంతకి ఆ జాగ్రత్త ఏమిటంటే సైక్లింగ్. అవును.. నిత్యం సైక్లింగ్ చేసే అలవాటు ఉండేవారు ఎప్పటికీ యంగ్‌గా ఉంటారని, వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని ఓ ఆధ్యయనం పేర్కొంది. ఏజింగ్ సెల్ అనే జర్నల్‌లో ఈ అంశాన్ని తాజాగా వెల్లడించారు. సాధారణంగా మధ్యవయసులో, వృద్ధాప్యంలో రోగాలు అలుముకుంటుంటాయి. రోగ నిరోధక శక్తి కుంటుబడుతుంది.
అయితే, సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారికి మాత్రం పైన పేర్కొన్న వయసులో ఇలాంటి పరిస్థితి ఉండదట. 55 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న వారిని మొత్తం 125మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ నిజాలు గుర్తించారు. ప్రతి వ్యక్తిలో ఉండే థైమస్ గ్రంధి (హృదయానికి సమీపంలో ఉంటుంది) సాధారణంగా రోగ నిరోధక శక్తి కణాలను (వీటినే టీ సెల్స్ అంటారు) ఉత్పత్తి చేస్తుంది. ఇవి సాధారణంగా 20 ఏళ్ల తర్వాత కాస్త మందగించినట్లుగా మారిపోతుంటాయి. అయితే, సైక్లిస్టుల్లో మాత్రం ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి అయ్యి, రోగ నిరోధక శక్తిని మరింత విస్తృతం చేస్తాయని, దాంతో మరింత యవ్వనంగా ఉండేలా చేస్తుందని, పురుషుల్లో ఇది టెస్టోస్టెరాయిన్ లెవల్స్‌కు మరింత బూస్ట్‌ను ఇచ్చినట్లుగా పనిచేస్తుందని కూడా శాస్త్రవేత్తలు తేల్చారు. అంతేకాదు, నిత్యం సైక్లింగ్ చేసేవారిలో పురుషులు అయితే, 6.5గంటల్లో 100 కిలోమీటర్లు, 5.5 గంటల్లో స్త్రీలు 60 కిలోమీటర్లు ప్రయాణించగలరని కూడా గుర్తించారు.
ఇలా చేయండి.. యవ్వనంతో మెరిసిపోండి
Published Fri, Mar 9 2018 3:16 PM | Last Updated on Fri, Mar 9 2018 3:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment