
చిన్న సమస్య వస్తే చాలు.. ఎడా పెడా యాంటీబయాటిక్‌లు వాడేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త. ఈ యాంటీబయాటిక్‌లు మన రోగ నిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయని.. ఫలితంగా మరిన్ని ఎక్కువ రోగాల బారిన పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.. హార్వర్డ్, మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు! రకరకాల కారణాల రీత్యా ఇప్పటికే కొన్ని బ్యాక్టీరియా మందులకు లొంగకుండా పోతున్న విషయం తెలిసిందే. కొత్త మందులేవీ అందుబాటులో లేని నేపథ్యంలో బ్యాక్టీరియా మరింత బలం పుంజుకునే అవకాశముంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎంఐటీ, హార్వర్డ్ శాస్త్రవేత్తలు అసలు ఈ యాంటీబయాటిక్స్ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు ఓ అధ్యయనం నిర్వహించారు.
ఈ కోలీ బ్యాక్టీరియాను ఎలుకల్లోకి ప్రవేశపెట్టి.. వాటికి సిప్రోఫ్లాక్సిన్ మందు ఇచ్చి శరీరం లోపల ఏరకమైన మార్పులు జరుగుతున్నాయో గుర్తించారు. ఈ మందు నేరుగా ఎలుక కణజాలంపై పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇది కాస్త జీవక్రియల కోసం విడుదలయ్యే రసాయనాల్లో మార్పులకు తద్వారా బ్యాక్టీరియా నిరోధానికి దారితీసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా యాంటీబయటిక్ మందులు మాక్రోఫేగస్ కణాలను దెబ్బతీయడంతో అవి వ్యాధులను అరికట్టే విషయంలో తక్కువ ప్రభావం చూపాయని జేసన్ యాంగ్ తెలిపారు.
పరి పరిశోధన
Comments
Please login to add a commentAdd a comment