
వైరస్ జీర్ణ వ్యవస్థలోకి చేరే వరకు దాని లక్షణాలేవీ బయటపడవు. అంతా బాగుంది కదాని అనుకునేలోపు.. శరీరంలో వైరస్ ఆర్‌ఎన్‌ఏ హైజాక్ చేసిన కణాలతో రోగ నిరోధక వ్యవస్థ మేల్కొంటుంది. అది.. సైటోకైన్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. అవి.. వైరస్ బారినపడ్డ కణాలను గుర్తించి నాశనం చే యడం మొదలుపెడతాయి. దీంతో జ్వరం వస్తుంది. ఆహారం తీసుకుంటే వామిటింగ్ సెన్సేషనల్ కలుగుతుంది. గంటల వ్యవధి లో ఛాతీ పట్టేసిన అనుభూతి.. పొడి దగ్గు మొదలై ఎంతకీ ఆగదు. కరోనా వైరస్ బారినపడ్డ వారిలో 80 శాతం మంది తేలికపాటి జలుబు లక్షణాలే కలిగి ఉండటం, సుమారు 13 శాతం మందిలో లక్షణాల తీవ్రత ఎక్కు వగా, 5 శాతం మందిలో విషమంగా ఉన్నట్టు పరిశోధనలు బలపరుస్తున్నాయి.