
వ్యాక్సిన్‌పై పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ వెల్లడి
ఛత్రపతి శంభాజీనగర్: మహిళల్లో వచ్చే కేన్సర్‌ను అడ్డుకునేందుకు మరో ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌రావ్ జాధవ్ వెల్లడించారు. 9–16 ఏళ్ల గ్రూపు వారు ఈ టీకాకు అర్హులని చెప్పారు. టీకాకు సంబంధించిన పరిశోధనలు తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు.
ప్రస్తుతం బ్రెస్ట్, నోటి, సెర్వికల్ కేన్సర్‌లపై టీకా ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. మన దేశంలో కేన్సర్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం పలు చర్యలను చేపట్టిందని ఆయన అన్నారు. మహిళల్లో 30 ఏళ్లు పైబడిన వారు ఆస్పత్రుల్లో ముందుగానే స్క్రీనింగ్ చేయించు కోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment