ఢిల్లీ: కోవిడ్ తర్వాత పెరిగిన గుండెపోటు కేసులపై కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. యువతలో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయని, కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ పార్లమెంటులో శుక్రవారం తెలిపారు. కోవిడ్ మహమ్మారి తర్వాత పెరుగుతున్న కార్డియాక్ అరెస్ట్ కేసులకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మూడు వేర్వేరు అధ్యయనాలను నిర్వహిస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.
ఇండియాలోని 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల పెద్దవారిలో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలపై అధ్యయనం దాదాపు 40 ఆసుపత్రులు, పరిశోధన కేంద్రాలలో కొనసాగుతోందన్న ఆయన.. భారత్‌లో 2022లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల జనాభాలో గుండెపోటు సంఘటనలపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావాన్ని గుర్తించడానికి దాదాపు 30 కొవిడ్ క్లినికల్ రిజిస్ట్రీ ఆసుపత్రులలో మరో మల్టీసెంట్రిక్ హాస్పిటల్ అధ్యయనం జరుగుతోందన్నారు.
చదవండి: మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి?
కార్డియోవాస్కులర్ వ్యాధి ఎన్‌పీ-ఎన్‌సీడీలో అంతర్భాగమని, ఇందులో మౌలిక సదుపాయాలను బలోపేతం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య ప్రమోషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్‌నెస్ సెంటర్ కింద 30 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో జనాభా ఆధారిత స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి రెఫరల్ ఉన్నాయని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు.
చదవండి: గుజరాత్ హైకోర్టు నుంచి చిత్రవిచిత్రాలు చూస్తున్నాం!
ఎన్‌పీ-ఎన్‌సీడీ కింద 724 జిల్లా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్‌లు, 210 డిస్ట్రిక్ట్ కార్డియాక్ కేర్ యూనిట్లు, 326 డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్లు, 6,110 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్డియోవాస్కులర్ వ్యాధి రోగులు మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి కేంద్రీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులతో సహా హెల్త్‌కేర్ డెలివరీ సిస్టమ్‌లోని వివిధ ఆరోగ్య సదుపాయాలలో చికిత్స పొందుతున్నారని మన్సూక్ మాండవీయ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment