prathap
-
పేదలు సొంతింట్లో ఉండటం చంద్రబాబుకు నచ్చదు: ఎమ్మెల్యే ప్రతాప్
-
సిట్‌కు జవాబులు చెప్పకుండా ఏడ్చేసిన ప్రతాప్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో ప్రత్యే క దర్యాప్తు బృందం (సిట్) విచారణను ముమ్మరం చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని 41–ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. అంబర్‌పేటకు చెందిన న్యాయ వాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్, నిందితుడు నందుకుమార్ భార్య చిత్రలేఖలు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ అధికారులు, వేర్వేరు గదుల్లో 8 గంటలకు పైగా వారిని విచారించారు. నిందితుడు నందు, ఆయన భార్య చిత్రలేఖ, ప్రతాప్ గౌడ్‌కు మధ్య పలు ఫోన్ సందేశాలు, వాట్సాప్ చాటింగ్, కాల్ రికార్డ్లను గుర్తించిన పోలీసులు.. వాటిపై ప్రతాప్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. తొలుత తాను ఎవరితోనూ సంభాసించలేదని, మెసేజ్‌లు చేయ లేదని పోలీసులతో వాదించినట్లు సమాచారం. దీంతో అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసు లు ఆయన ముందు ఉంచి ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ప్రతాప్ బోరున విలపించినట్లు తెలిసింది. నందుతో పరిచయం, ఇతరత్రా సంబంధాలపై ఆరా తీయగా జవాబు చెప్పకుండా దాటే శారు. సాయంత్రం వరకు ప్రతాప్‌ను విచారించినా లాభం లేకపోవటంతో శనివారం కూడా విచారణకు హాజరుకావాలని దర్యాప్తు అధికారి ఆయన్ను ఆదేశించారు. సోమవారం మరోసారి రండి..: నందు భార్య చిత్రలేఖను విచారించిన సిట్ అధికారులకు వింత అనుభవం ఎదురైంది. పోలీసులు స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్లో ఆమెకు, ప్రతాప్ గౌడ్, నందుకు మధ్య పలు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలు బయటపడ్డాయి. ఆయా మెసేజ్‌లలో ఏ సమాచా రం ఉందని? ఎందుకు చేశారని చిత్రలేఖను ప్రశ్నించగా.. తెలియదు, గుర్తులేదు, నాకు రాలేదని వింత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. నందుకు చెందిన డెక్కన్ కిచెన్, నివాసంలోని సీసీ రికార్డుల్లో నమోదైన పలువురు ఫొటోలను చూపించి, వారెవరు? ఎందుకొచ్చారని ఆమెను ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు తెలిసింది. అయితే ఆమె డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ కార్యకలాపాలు, లావాదేవీల గురించి ప్రశ్నించగా ధైర్యంగా సమాధానాలు ఇచ్చిన చిత్రలేఖ.. ఈ కేసుకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వకపోవటంతో, ఉద్దేశపూర్వకంగానే ఆమె అలా వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తిరిగి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. హైకోర్టు ఆదేశించినా శ్రీనివాస్ గైర్హాజరు: శుక్రవారం సిట్ విచారణకు హాజరుకావాలని శ్రీనివాస్‌ను హైకోర్టు ఆదేశించినా ఆయన గైర్హాజరయ్యారు. కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్‌ను ఈ కేసులో ఏ–7గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో విచారణకు హాజరైతే అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. నందు, సింహయాజీలతో కలిసి శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో సంచరించడానికి సంబంధించిన ఆధారాలు, నందుతో రూ.55 లక్షలకు సంబంధించిన లావాదేవీలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: మల్లారెడ్డి కేసులో ట్విస్ట్.. హైకోర్టులో భద్రారెడ్డికి షాక్! -
ఏబీసీ నూతన చైర్మన్‌గా ప్రతాప్ పవార్
న్యూఢిల్లీ: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ఏబీసీ) నూతన చైర్మన్‌గా ప్రతాప్ పవార్ ఎన్నికయ్యారు. మరాఠీ దినపత్రిక ‘సకల్’ను ప్రచురించే సకల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. 2022–23 సంవత్సరానికి గాను ఏబీసీ చైర్మన్‌గా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో మహ్రాత్తా చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్(పుణే) అధ్యక్షుడిగా సేవలందించారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ప్రతాప్ పవార్‌ను భారత ప్రభుత్వం 2014లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా శ్రీనివాసన్ కె.స్వామి ఎన్నికయ్యారు. -
నేటి నుంచి ప్రగతి రథం పరుగులు
చార్జీలు యధాతథంగా ఉంటాయి. అన్ని రకాల రాయితీ ప్రయాణాల్ని తాత్కాలికంగా నిలిపేశాం. ప్రతి ప్రయాణికుడు మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ కలిగి ఉండాలి. టిక్కెట్ ఉన్న ప్రయాణికుడిని మాత్రమే బస్టాండ్‌లోకి అనుమతిస్తారు. ఏ రోజుకు ఆ రోజు బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ చార్జీలు వసూలు చేయడం లేదు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వాలెట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 65 ఏళ్లు దాటిన వాళ్లు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే (మెడికల్ ఎమర్జెన్సీ) బస్సులో అనుమతిస్తాం. నెమ్మదిగా ఆర్థిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతాం. రాత్రి పూట కర్ఫ్యూ ఉన్నా, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని బస్సులు నడుపుతాం. అయితే ప్రయాణికులు రాత్రి 7 గంటలలోపే బస్టాండ్‌కు చేరుకోవాలి. విశాఖ, విజయవాడలో సిటీ బస్సులు నడపటం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు నడపాలని ఆయా రాష్ట్రాల అనుమతి కోసం లేఖలు రాశాం. వారి నుంచి అనుమతి రాగానే ఆ సర్వీసులు ప్రారంభిస్తాం. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభిం చనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ ప్రారంభమైంది. కండక్టర్లు లేకుండా నగదు రహిత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ విజయవాడలోని ఆర్టీసీ హౌజ్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ► సూపర్ డీలక్స్, లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించాం. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూర్చోకూడని సీట్లకు మార్క్ చేశాం. బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. బస్టాండ్లలో మాస్క్‌లు అందుబాటులో ఉంటాయి. 10 రూపాయలకు మాస్క్ అమ్మాలని నిర్ణయించాం. ► 58 రోజుల నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిత్యావసర వస్తువుల కోసం కొన్ని బస్సులు తిప్పాం. వలస కూలీల కోసం అన్ని చెక్‌పోస్ట్‌లలో బస్సులు ఉంచాం. రిలీఫ్ సెంటర్లకు వారిని చేర వేసేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేశాం. ► ప్రతి బస్టాండ్‌లో శానిటైజర్ సదుపాయాన్ని కల్పించాం. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నగదు రహితంగా, పేపర్ లేకుండా టికెట్ ఇవ్వాలని చాలా కాలం కసరత్తు చేశాం. ఆర్డినరి, ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, డీలక్స్ బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించాం. ► మన రాష్ట్రంలో తొలుత 17 శాతం సర్వీసులు, అంటే 1,683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం. ► ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. 26 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహిస్తాం. అటెండర్లు ఉండరు. ఏసీ సర్వీసుల్లో దుప్పట్లు ఇవ్వము. ► లాక్డౌన్ కాలంలో ఆర్టీసీకి రూ.1,200 కోట్ల నష్టం వచ్చింది. రూ.700 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. -
ప్రతాప్.. మళ్లీ పోలీస్
సాక్షి, సిటీబ్యూరో: అతను చదివింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజినీరింగ్. చేరింది నగరంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో. ఆపై పెళ్లి సంబంధాలు చూస్తే.. కానిస్టేబులా.. అంటూ తీసి పారేస్తున్నారనే మనస్తాపంతో ఉద్యోగానికి రాజీనామా చేసి గత ఏడాది వార్తల్లోకెక్కిన చార్మినార్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ప్రతాప్.. మళ్లీ పోలీస్ ఉద్యోగంలో చేరారు. విశాఖ జిల్లా కొత్తవలసకు చెందిన ప్రతాప్ తండ్రి ఈశ్వర్రావు చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. పాల వ్యాపారం చేస్తూ ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని బాగా చదివించారు. ఇంజినీరింగ్ అనంతరం ప్రతాప్ కానిస్టేబుల్‌గా ఎంపికై చార్మినార్ పీఎస్‌లో పనిచేసేవారు. చాలా పెళ్లి సంబంధాలు చూసినా.. కానిస్టేబుల్‌కు పిల్లనివ్వమంటున్నారన్న ఆవేదనతో ఏకంగా పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి రాజీనామా చేశారు. ఆపై బిజినెస్ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయతాల్లో పెళ్లి సంబంధాలు చూసినా కలిసి రాకపోవటంతో మళ్లీ తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని పెట్టుకున్న అర్జీని అధికారులు ఓకే చేయటంతో.. ప్రతాప్ మళ్లీ విధుల్లో చేరారు. ప్రస్తుత పోస్టింగ్ చార్మినార్ పీఎస్‌లో అయినా.. డీపీజీ కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో డిప్యుటేషన్లో పనిచేస్తున్నారు. తన కుమారుడు మనసు మార్చుకుని మళ్లీ ఉద్యోగంలో చేరటం సంతోషంగా ఉందని ఆయన తండ్రి ఈశ్వర్రావు చెప్పారు.(కనీసం.. పిల్లనివ్వడం లేదు) -
నా భార్య కళ... ఇదేనా కల
‘జీవితం మనం ప్లాన్ చేసుకున్న ప్రకారం ఉండదని బాగా నమ్ముతాను. ఎందుకంటే నేను అనుకున్నవాటికన్నా నన్ను వేరేగా చూపింది ఈ లైఫ్ జర్నీ’అంటూ తన గురించి పరిచయం చేసుకున్నారు ప్రతాప్ అభి. ‘శశిరేఖ పరిణయం’,‘కుటుంబ గౌరవం’, ‘కుంకుమపువ్వు’, ‘తేనెమనుసులు’, ‘నిన్నే పెళ్లాడతా..’ఇలా వరుస సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితుడు ప్రతాప్ అభి.తన గురించి ఇలా వివరించారు. ‘సీరియల్స్ చేస్తూనే నాలుగేళ్ల క్రితం ‘ముద్దపప్పు – ఆవకాయ’ టైటిల్‌తో వెబ్‌సీరీస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని ఆలోచన ఏమీ లేదు. మాది ఖమ్మం జిల్లా పాల్వంచ. మా నాన్నగారు పవర్ స్టేషన్లో ప్రభుత్వోద్యోగి. అమ్మ గృహిణి. ముగ్గురు అన్నదమ్ములం. ఇంట్లో నేనే పెద్దవాడిని. నా ఇష్టాలకు ఇంట్లో ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కానీ, నా భవిష్యత్తుకు ఒక మార్గం వేసుకోవడంలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఇందులో పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. నిన్నే పెళ్లాడతా... ‘జీ’ తెలుగులో వస్తున్న ఈ సీరియల్ నాకు జీవితాన్నే ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సీరియల్లో హీరోయిన్గా నటించిన అనూష హె గ్డే నిజ జీవితంలో నా అర్ధాంగి అయ్యింది. ఇప్పుడు అనూష ‘సూర్యకాంతం’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తోంది. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో ఏర్పడిన మా పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. తనది మంగుళూరులోని పుత్తూరు. మా ఇరు కుటుంబాల వాళ్లు మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరం కిందటి నెలలో పెళ్లి చేసుకున్నాం. త్రీ క్యారెక్టర్స్... బుల్లితెర మీద నా లైఫ్ ఇచ్చిందే ‘శిశిరేఖపరిణయం’ సీరియల్, ఆ తర్వాత తేనెమనసులు. ఇప్పుడు నిన్నే పెళ్లాడతా! ఈ మూడు సీరియల్స్‌లోని మూడు క్యారెక్టర్స్ నాకు మంచి గుర్తింపునిచ్చాయి. అయితే, సీరియల్స్‌లో ముందు కథ విన్నప్పుడు క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. ఆ తర్వాత రేటింగ్ బట్టి కథ, క్యారెక్టరైజేషన్ అన్నీ మారుతాయి. దానిని మనం డిసైడ్ చేయలేం. అందుకే లైఫ్ అంటే ఇలాగే ఉండబోతుందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. విధిని నమ్ముతాను... చదువుకునే రోజుల్లో దేవుడు–దెయ్యం అంటూ నమ్మకాలు ఏవీ లేవు. ప్రసాదాల కోసం గుడికి వెళ్లాలని అనుకునేవాడిని. కుటుంబం అంతా కలుసుకోవడానికి ఒక మంచి సందర్భం అనుకునేవాడిని. ఇంటర్మీడియట్ నుంచి నాకు తెలియకుండానే నా జీవితంలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఆ సమయంలో భయంతో స్టార్ట్ అయిన భక్తి ఇప్పుడు ప్రేమగా మారింది. ఇలా జరిగి తీరాల్సిందే అని గట్టిగా నేను అనుకున్నప్పుడల్లా అలా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో నమ్మకం మీద ఎక్కువ నమ్మకం ఏర్పడింది. పంచభూతాలు ఉన్నట్టే దైవం కూడా ఉందని, భయానికి ధైర్యంలా, ప్రశ్నకు సమాధానంలా ఈ సృష్టికి భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను. ఆర్మీకి వెళ్లాలనుకున్నా ఇంటర్మీడియట్ టైమ్‌లో ఆర్మీకి వెళ్లాలని చాలా ఆరాటపడ్డాను. సైనికుడిని కావాలన్నది నా లక్ష్యంగా ఉండేది. కానీ, అనుకోని కారణాల వల్ల ఆర్మీకి వెళ్లే అవకాశం కోల్పోయాను. ఆ విషయం అర్ధమయ్యాక డిప్లమా ఇన్ యానిమేషన్, మల్టీమీడియా కోర్సు చేశాను. ఇది పూర్తయ్యాక కోరుకున్న కంపెనీలో అవకాశాలు రాలేదు. దీంతో 2009 నుంచి సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. 2013లో ఒక సినిమాలో అవకాశం వచ్చింది. కానీ, అది మొదట్లోనే ఆగిపోయింది. అయితే నిరాశ చెందలేదు. పడిపోయిన దగ్గరే ప్రయత్నాలు చేయాలనుకున్నాను. అప్పుడు ‘శిశరేఖ పరిణయం’ సీరియల్ ఆడిషన్స్‌కి పిలుపు వచ్చింది. సెలక్ట్ అయ్యాను. అప్పటినుంచి ఈ ఫీల్డ్‌లో కొనసాగుతున్నాను. నా భార్య కళ .. నా కల జీవితంలో బాగా సెట్ అవ్వాలి. పచ్చదనానికి దగ్గరగా ఉండాలి. వ్యవసాయం చేయాలి. పక్షులతో కబుర్లు చెప్పాలి. మూగజీవాల ఆలనాపాలన చూసుకోవాలి. అందుకు ఒక ఫామ్ హౌజŒ ఏర్పాటు చేసుకోవాలనేది ఆలోచన. అంతకుమించి ఒక నృత్య అకాడమీ ఏర్పాటు చేయాలన్నది కల. నా భార్య అనూష క్లాసికల్ డ్యాన్సర్. తనకు నృత్యం అంటే ప్రాణం. తన కోసమే ఇప్పుడు కల కంటున్నా. దానిని నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నా. విధి ఎటువైపుగా తీసుకెళుతుందో చూడాలి.’ – సంభాషణ: నిర్మలారెడ్డి -
‘నకిలీ’ ప్రతాపం
కేఈ బ్రదర్స్. ఈ పేరు చెప్పగానే దాదాపు మూడు దశాబ్దాలుగా జిల్లా వాసులకు గుర్తొచ్చేది మద్యం వ్యాపారం. దీని ద్వారానే వారు ఆర్థికంగా ఎదిగి.. రాజకీయాల్లో చక్రం తిప్పారు. మద్యం వ్యాపారంతో పాటు నకిలీ మద్యం కూడా తయారు చేసేవారని తెలుస్తోంది. డోన్ మండలం ఉడుములపాడులో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ పేరు చేర్చారు. ఆయనతో సహా మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో టీడీపీ నాయకులు..అది కూడా కేఈ అనుచరులే ఎక్కువగా ఉండడం గమనార్హం. గోవా, కర్ణాటక కేంద్రంగా నకిలీ మద్యం తయారీ వీరి కనుసన్నల్లోనే జరిగిందని తెలుస్తోంది. కేసులను పరిశీలిస్తే మద్యం రాకెట్ గోవా నుంచి కర్నూలు వరకూ విస్తరించినట్లు స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమలో నకిలీ మద్యం వ్యాపారం కొన్నేళ్లుగా సాగుతోంది. గోవా, కర్ణాటక నుంచి ఇది సరఫరా అవుతోంది. గోవాలోని ఓ బేవరేజస్‌లో నకిలీ మద్యం తయారు చేసి, నకిలీ లేబుళ్లు అతికించి వేల కేసులను ‘సీమ’కు సరఫరా చేసేవారు. డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలుతో పాటు కడప, చిత్తూరు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాలకు కూడా ఇది సరఫరా అయ్యేది. కంటైనర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేసేవారు. దీంతో పాటు నాటుసారా ఎక్కువగా కాసేవారు. ఈ దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లో సాగింది. తాజాగా డోన్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును పరిశీలిస్తే ఏళ్ల తరబడి నకిలీ మద్యం దందా ఎలా సాగిందో స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో వారికి కొందరు ఎక్సైజ్ అధికారుల అండ కూడా ఉండేది. ఫలితంగా భారీ ముడుపులు స్వీకరించేవారని తెలుస్తోంది. ఐదేళ్ల కిందటే గుట్టురట్టు నకిలీ మద్యం కర్నూలు జిల్లాకు సరఫరా అవుతోందని 2014 డిసెంబర్ 7న అనంతపురం ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. 8వ తేదీ రాత్రి నిఘావేసి గుత్తి హైవేలో ఓ కంటైనర్‌ను పట్టుకున్నారు. అందులో వేల సంఖ్యలో మెక్‌డొవెల్స్, ఇతర బ్రాండ్ల పేరిట ఉన్న మద్యం బాటిళ్లు లభించాయి. వాటిని ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా మొత్తం నకిలీ మద్యమని తేలింది. ఈ కేసులో అప్పట్లో ఎనిమిది మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఏ1గా గోవాలోని డ్రైవర్ గుల్జార్ హుస్సేన్, ఏ2గా జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిందర్లాల్, ఏ3గా బెంగళూరు వాసి కార్గో రమేశ్, ఏ4గా బంటిసింగ్(గోవా), ఏ5గా రమేశ్‌సింగ్(హర్యానా), ఏ6, ఏ7, ఏ8గా బెంగళూరు వాసులు రామయ్య, శివన్న, రాకేశ్‌లపై చార్జ్‌షీటు వేశారు. అప్పటి మంత్రి జోక్యంతో కేసు తారుమారు కంటైనర్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు గోవాకు వెళ్లి అక్కడి బేవరేజస్ను పరిశీలించారు. నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు తేలడంతో రామయ్య అనే వ్యక్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కర్నూలు జిల్లా డోన్‌కు తీసుకెళుతున్నట్లు అప్పట్లో నిందితులుచెప్పినట్లు తెలిసింది. తాజాగా డోన్ పరిధిలో నమోదైన నకిలీ మద్యం కేసులో పేర్కొన్న వ్యక్తుల్లోని కొందరు అప్పట్లో ఈ కంటైనర్‌ను రప్పించారు. ఈ విషయం విచారణలో తేలింది. అయితే అప్పటి ప్రభుత్వ ‘పెద్ద’ జోక్యంతో కేసును తారుమారు చేశారని తెలుస్తోంది. కంటైనర్‌ను పట్టుకున్న పోలీసులు అది ఎక్కడికి వెళుతోంది? ఎవరు తెప్పించారనేది చార్జ్‌షీట్‌లో పొందపరచలేదు. ‘గుత్తికి కంటైనర్ చేరిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది. అప్పుడు ఆ స్థలానికి తీసుకురండి’ అని డ్రైవర్ చెప్పినట్లు పేర్కొని కేసును మూసేశారు. కంటైనర్ ఎక్కడికి వెళుతోందనేది తెలుసుకోవాలని ఎక్సైజ్ పోలీసులు భావించి ఉంటే ఫోన్‌కాల్ ఆధారంగా పట్టుకోలేరా అనేది తేలాల్సిన ప్రశ్న. కాగా ఈ కేసు ఎఫ్ఐఆర్ 2014లో నమోదు కాగా చార్జ్‌షీట్ మాత్రం 2018లో వేశారు. తరచూ నకిలీ మద్యం సరఫరా గోవా, కర్ణాటక నుంచి నకిలీ మద్యం తరచూ సరఫరా అయ్యేది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటం, జిల్లాలో కేఈ బ్రదర్స్ హవా నడవడంతో ఎక్సైజ్ పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించారు. దీంతో నకిలీ దందా యథేచ్ఛగా సాగింది. అలాగే ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్‌ను కూడా వీరు సరఫరా చేసేవారు. మన రాష్ట్రంలోని మద్యం ఈఎన్ఏ (ఎక్స్ట్రా నూట్రల్ ఆల్కహాల్)బేస్డ్తో తయారవుతుంది. కర్ణాటకలో ఆర్ఎస్(రెక్టిఫై స్పిరిట్)బేస్డ్తో తయారు చేస్తారు. ఈఎన్ఏ లిక్కర్ డబుల్ఫిల్టర్, ఆర్ఎస్ సింగిల్ఫిల్టర్. ఆర్ఎస్తో పోలిస్తే ఈఎన్ఏ బేస్డ్ మద్యం తయారీకి వాడే స్పిరిట్ ధర ఎక్కువ. దీంతో ఆర్ఎస్ బేస్డ్ లిక్కర్ తక్కువ ధరతోనే లభిస్తుంది. దీంతో క్వార్టర్, డిప్లు ఎక్కువగా కర్ణాటక, గోవా నుంచి దిగుమతి చేసుకుంటారని తెలుస్తోంది. ట్యాక్స్ భారం కూడా ఉండదు. దీంతో వాటికి స్టిక్కర్లు అంటించి ఇక్కడి వైన్‌షాపుల్లో విక్రయించి రూ.కోట్లు దండుకున్నారు. సెకండ్స్, థర్డ్తోనే థ్రెట్ బేవరేజెస్ నుంచి తెచ్చుకునేది మొదటి రకం. ఇది మన వైన్‌షాపుల్లో విక్రయిస్తారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చేది ‘సెకండ్స్’. స్పిరిట్, మరిన్ని రసాయనాలతో ఇక్కడే తయారుచేసేది థర్డ్. సెకండ్స్‌తో పాటు థర్డ్ విక్రయాలు జోరుగా సాగించారు. వీటిని సేవించి ఆరోగ్యం గుల్ల చేసుకుని ప్రాణాలు కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపడంతో ‘డోన్’లోని ‘నకిలీ ముఠా’ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తే జిల్లాతో పాటు కర్ణాటక, గోవాలోని నకిలీ మద్యం తయారీ స్థావరాలు, ఇంకొందరు పెద్దమనషుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. అయ్యప్పగౌడ్ అరెస్ట్ డోన్ టౌన్: నకిలీ మద్యం కేసులో 3వ నిందితుడిగా ఉన్న అయ్పప్పగౌడ్ను మంగళవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇతను గత ఐదేళ్లుగా డోన్‌లోని మద్యం సిండికేట్ కార్యాలయ వ్యవహారాలు చూసేవాడు. ఇతనితో నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇంకా 24 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. వీరిలో డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కూడా ఉన్నారు. -
నకిలీ మద్యం కేసులో కేఈ ప్రతాప్
టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్జనే ధ్యేయంగా తెగబడ్డారు. ఏ ఆదాయ మార్గాన్నీ వదులుకోలేదు. చివరకు నకిలీ మద్యం కూడా విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో స్వయాన మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్‌పై కేసు నమోదు కావడం గమనార్హం. ఈ కేసులో మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో సహా 25మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డోన్ : సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావడంతో జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా పోలీసులు ఇంతవరకు 11మందిని అరెస్టు చేశారు. ప్రతాప్‌తో పాటు 25 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సిండికేట్ లాభాల్లో కేఈ ప్రతాప్‌కు 25 శాతం, మిగిలిన వారు 75శాతం చొప్పున పంచుకున్నట్లు విచారణలో బహిర్గతమైంది. సిండికేట్‌లో మొత్తం 20 మంది ఉండగా అందరూ టీడీపీ నాయకులే కావడం విశేషం. వీరిలో అత్యధికులు కేఈ బంధువులు కావడం కూడా గమనార్హం. 2014 ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఆడపడచుల కన్నీళ్లు తుడిచేందుకు బెల్టుషాపులను రద్దుచేస్తానని హామీ ఇచ్చిన సంగతి విదితమే. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుతమ్ముళ్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేవిధంగా నకిలీ మద్యాన్ని తయారుచేసి బెల్ట్‌షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు కొనసాగించారు. సిండికేట్‌గా ఏర్పడిన ఈ ముఠా ప్రభుత్వ మద్యం దుకాణాల లైసెన్స్‌దారుల ముసుగులో వేలకొద్దీ నకిలీ మద్యం బాటిళ్ల కేసులను బెల్ట్‌షాపులకు సరఫరా చేసి కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించినట్లు వెల్లడైంది. తీగ లాగితే డొంక కదిలింది గత డిసెంబర్ 10వ తేదీన కృష్ణగిరి మండలం అమకతాడులో జయపాల్ రెడ్డి, కంబాలపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డితో పాటు మరో ముగ్గురిని నకిలీ మద్యం విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేశారు. ఉడుములపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త రాంబాబు నకిలీ మద్యాన్ని రవాణా చేస్తూ పత్తికొండ వద్ద వాహనాన్ని తగిలించి వ్యక్తి మృతికి కారణం కావడంతో కేసు కొత్తమలుపు తిరిగింది. రాంబాబును విచారించిన అనంతరం ఉడుములపాడు గ్రామంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును సవాల్‌గా తీసుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వినోద్ ఖలాల్‌ను గత నెల 28వ తేదీన పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం టీడీపీ నేతల పాత్ర వెల్లడైంది. నిందితులు వీరే 1.వినోద్‌ఖలాల్ (హుబ్లీ) 2.పుట్లూరు శ్రీను (టీడీపీ) 3.ఈడిగ అయ్యప్ప గౌడ్ (టీడీపీ) 4.ఈడిగ శ్రీనివాసగౌడ్ (అమరవాయి, తెలంగాణ రాష్ట్రం) 5.ఈడిగ బేతపల్లి రంగస్వామి 6.ఉప్పరి రాంబాబు(టీడీపీ) 7.ఈడిగ మనోహర్ గౌడ్ (టీడీపీ) 8.చిట్యాల మురళీగౌడ్ (టీడీపీ)9.దేవరబండ రాము గౌడ్ (టీడీపీ)10. రోహిత్ ఖలాల్ (హుబ్లీ) 11.రాకేష్ ఖలాల్ (హుబ్లీ) 12.సునీల్ ఖలాల్ (హుబ్లీ) 13.సంజు మార్వాడి (హుబ్లీ) 14.మంజు హగేరీ (హుబ్లీ) 15.వినాయక జతూరే (హుబ్లీ) 16 బాబు (హుబ్లీ) 17.అద్దంకి శ్రీనివాసరావ్ (టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 18.అద్దంకి గోపి ( టీడీపీ నేత, ప్రకాశం జిల్లా) 19.కృష్ణాగౌడ్ (టీడీపీ, తెలంగాణ రాష్ట్రం) 20.ఎల్లాగౌడ్ ( కర్ణాటక) 21.అల్లారుదిన్నె వెంకటేశ్ (టీడీపీ) 22.తలమరి రామలింగ (కర్ణాటక) 23.పరశురాం (కర్ణాటక) 24.ఉదయ్ గౌడ్ (టీడీపీ) 25.డీలర్ రాము గౌడ్ (టీడీపీ) 26.కేఈ ప్రతాప్ (నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్) 27.టీఈ కేశన్న గౌడ్ (మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, టీడీపీ) 28.చిట్యాల లోకనాథ్ గౌడ్ (టీడీపీ),29.భాష్యం శ్రీనివాసులు (టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్త) 30.కంబాల పాడు కేఈశ్యామ్ (మున్సిపల్ కోఆప్షన్ మాజీ సభ్యుడు, టీడీపీ) 31.గిద్దలూరు శ్రీనివాస గౌడ్ (టీడీపీ) 32.కటారుకొండ మర్రి శ్రీరాములు(శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు) 33.కటారుకొండ మర్రి మోహన్ రెడ్డి (టీడీపీ) 34.Ôశేఖర్‌గౌడ్ (టీడీపీ), 35.రామకృష్ణ (గుత్తి, అనంతపురం జిల్లా) 36. పీవీ రమణ (గుత్తి.) సిండికేట్ ఇష్టారాజ్యం మద్యం దుకాణాల నిర్వహణలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్న టీడీపీ నాయకులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. వీరి ప్రధాన కార్యాలయం నుంచే డోన్ నియోజకవర్గంలోని 131 గ్రామాలతో పాటు కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లోని మరో 65గ్రామాల్లో ఏర్పాటు చేసిన బెల్ట్‌షాపులకు నకిలీ మద్యాన్ని సరఫరా చేసి జోరుగా విక్రయించారు. ఎక్సైజ్‌శాఖలో కీలకపదవిలో ఉన్న ఒక ఉన్నతాధికారితో పాటు 2014 నుంచి ఇక్కడ విధులు నిర్వహించిన అధికారులందరికీ ఈ విషయం తెలిసినా మామూళ్లకు కక్కుర్తిపడి బయటకు పొక్కనివ్వలేదనే ఆరోపణలున్నాయి. -
బందోబస్తు నిర్వహించిన ప్రతాప్
సాక్షి, సిటీబ్యూరో: ‘కానిస్టేబుల్ అంటే పెళ్లి కావట్లేదు’ అంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలనం సృష్టించిన చార్మినార్ ఠాణా కానిస్టేబుల్ సిద్ధాంతి ప్రతాప్ గురువారం విధులు నిర్వర్తించారు. అతడి రాజీనామా ఇప్పటి వరకు ఆమోదం పొందకపోవడంతో సామూహిక నిమజ్జనం డ్యూటీలో భాగంగా చార్మినార్ వద్ద విధులు నిర్వర్తించారు. ఆసక్తితో డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటికీ అనివార్య కారణాల నేపథ్యంలో తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ ప్రతాప్ నగర పోలీసు కమిషనర్‌కు ఆంగ్లలో రాసిన లేఖను శనివారం బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో ఉన్న ఇన్వార్డ్ సెక్షన్లో ఇచ్చిన విషయం విదితమే. బుధవారం వెలుగులోకి వచ్చిన ఆ అంశం పోలీసు విభాగంలో కలకలం సృష్టించింది. పలువురు కానిస్టేబుల్ స్థాయి అధికారులు దీనిని సోషల్‌మీడియాలో షేర్ చేశారు. పదోన్నతుల విషయంలో తామూ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామంటూ కామెంట్స్ పెట్టారు. దీంతో ప్రతాప్ రాజీనామా వ్యవహారం హల్చల్ చేసింది. ఈయన రాజీనామాపై పోలీసు విభాగం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో చార్మినార్ ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న అతడికి బందోబస్తులో భాగంగా చార్మినార్ వద్దే డ్యూటీ వేశారు. ప్రతాప్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా... తన రాజీనామాపై పునరాలోచన చేస్తానంటూ చెప్పారు. చదవండి :కానిస్టేబుల్ అంటే పెళ్లి కావట్లేదు -
మంత్రి గారి తమ్ముడు..మహా ముదురు
అన్న చాటున తమ్ముడు ‘ప్రతాప’ం చూపుతున్నాడు. మంత్రి గారి తమ్ముడామజాకా.. అంటూ ఓ వైపు అధికారులకు చుక్కలు చూపిస్తూ.. మరో వైపు అక్రమ దందాకు తెరలేపారు. భూ బకాసురుడిగా మారి కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జాకు పాల్పడుతున్నారు. వాగులు.. వంకలు.. పేదలకు పంపిణీ చేసిన స్థలాలు.. వక్ఫ్ భూములు రాత్రికి రాత్రే రియల్ వెంచర్లుగా మారిపోతున్నాయి. ఆన్లైన్లో రికార్డులు సైతం తారుమారవుతున్నాయి. దేవుని మాన్యాలను వదలడం లేదు. అక్రమార్జనకు రియల్ దందాతో పాటు ఇసుక, మట్టి, మద్యం వ్యాపారం చేస్తున్న డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోకస్.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఆయన సర్పంచ్ కాదు.. కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. అయినా ఆయన చెప్పిందే అధికారులకు వేదం.. కేవలం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా ఉంటూనే అధికారికంగా ప్రొటోకాల్ పాటించేలా చేసుకుంటున్నారు. జన్మభూమి కమిటీ సమావేశాలు మొదలు.. అన్ని ప్రభుత్వ సమావేశాలను కూడా ఆయన నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జిల్లాలో చేపట్టే అధికారిక కార్యకలాపాలన్నీంటికీ కేఈ ప్రతాప్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎక్కడ పర్యటించాలన్నా.. అధికారులు కూడా ముందస్తుగా ఈయన అనుమతి తీసుకోవాల్సిందే. అన్న చాటు తమ్ముడిగా డోన్‌లో అధికారాన్ని చెలాయిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. రైల్వే జంక్షన్‌గా ఉన్న డోన్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చింది మొదలు.. ఖాళీ భూములన్నింటినీ ఆయన హయాంలో అనుచరులు ఆక్రమించేసుకుంటున్నారు. మునిసిపాలిటీ మొదలు మార్కెట్ కమిటీ వరకూ ఆయనకు కప్పం కట్టాల్సిందే. అన్న మౌనం పూర్తి అంగీకారం అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. దర్జీల స్థలాలు.. దర్జాగా కబ్జా 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... ప్రస్తుత డిప్యూటీ సీఎంకేఈ కృష్ణమూర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న 270 సర్వే నంబర్లో 4 ఎకరాల స్థలంలో టైలర్స్‌కు ఇళ్లపట్టాలు ఇచ్చారు. ఆయన చేతుల మీదుగా తమకు ఇళ్లపట్టాలు వచ్చాయన్న సంతోషంతో ఏకంగా ఆ కాలనీకి కేఈ కృష్ణమూర్తి నగర్‌గా పేరు పెట్టారు. అయితే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా... అన్న పంచిన పట్టాలను తమ్ముడుఆధ్వర్యంలో అధికారపార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. తమ ఇళ్ల పట్టాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సుమారు 200 బేస్ మట్టాలను నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేశారు. అయితే, ఇక్కడ ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరుతో బహుళంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అసలైన లబ్ధిదారులను కాదని టీడీపీ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వంకను కుదించి.. ప్రభుత్వ నిధులతో గోడ కట్టి డోన్ పట్టణం నడి ఒడ్డున ఉన్న వంక భూమిని అధికారపార్టీకి చెందిన మరో నేత... చదును చేసుకుని పొలంగా మార్చడమే కాకుండా ఏకంగా ఉన్న కొద్దిపాటి వాగుకు అడ్డంగా గోడను కూడా నిర్మించారు. వాగు నీరు పొలంలోకి రాకుండా చేసేందుకు ఈ విధంగా చేసుకున్నారు. అయితే, ఈ గోడను కూడా ప్రభుత్వ నిధులతో నిర్మించడం గమనార్హం. నీరు – చెట్టులో 15 శాతం కమీషన్ నియోజకవర్గంలో ఉన్న వాగులు, వంకల్లో నీరు–చెట్టు పథకం కింద రూ.50 కోట్ల మేర పనులు మంజూరు చేసుకున్నారు. ఈ పనులను కాంట్రాక్టర్‌తోపాటు నేతలకూ అప్పగించారు. సుమారు 15 శాతం వరకూ కమీషన్ తీసుకుని పనులు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే, వాగులు, వంకల్లో మట్టి పూడిక తీత పనులు ముగిసిన తర్వాత... మళ్లీ నీరు–చెట్టు పథకం కింద చెక్‌డ్యాంల నిర్మాణ పనులను మంజూరు చేయించుకున్నారు. అయితే, ఈ పనులల్లో భారీగా ఆదాయం ఉండదని అనుకున్న తెలుగు తమ్ముళ్లు కాస్తా పనులను కాంట్రాక్టరుకు 5 శాతం కమీషన్‌కు అప్పగించారు. ఈ పనులు సిమెంటుతో కాకుండా ఇసుక సంచులతో చెక్‌డ్యాంలను నిర్మించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నీరు–చెట్టు పనుల్లో తవ్విన మట్టిని... చెరువు కట్టడాలను మరింత పటిష్టం చేసేందుకు ఉపయోగించాలి. ఇందుకు విరుద్ధంగా.... చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్న ప్రతి ట్రాక్టర్‌కు రూ.200 కప్పాన్ని ట్రాక్టర్ యజమానుల నుంచి వసూలు చేస్తున్నారు. అబ్బిరెడ్డిపల్లె, జగదూర్తి, ఉడుములపాడు, వెంగళాంపల్లె, కొచ్చెర్వు లాంటి చెరువుల వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తూ ప్రతి రోజూ వేలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఇసుక మేటల చాటున.. ఓ వైపు ప్రభుత్వం ఉచిత ఇసుకను అందిస్తున్నామని చెబుతోంది. ఇందుకోసం ఏకంగా ఇసుక పాలసీని తెచ్చామని ప్రచారం చేసుకుంటోంది. నియోజకవర్గంలో ఉన్న వాగులు, వంకల్లోని ఇసుకను ముందుగానే తోడుకుని భారీగా డంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరికి ఇసుక కావాలన్నా ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి కల్పించారు. ట్రాక్టర్ కటకం ఇసుక రూ.800, ట్రాక్టర్ ప్లాస్టింగ్ ఇసుక రూ.1500 ఉండాల్సి ఉండగా టీడీపీ నాయకుని అండదండలతో ఇసుక రేట్లను అమాంతంగా పెంచేశారు. తాము తప్ప ఇసుకను ఎవరూ తరలించడం, విక్రయించడం చేయరాదని హుకూం జారీ చేశారు. కటకం ఇసుక రేటును రూ.2 వేలు, ప్లాస్టింగ్ ఇసుకను ట్రాక్టర్ రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవానికి రోజువారీ అవసరాలకు మినహా ఇసుక డంప్‌లను ఏర్పాటు చేయడం నేరం. అంతేకాకుండా అటువంటి ఇసుక డంపులపై పోలీసు, రెవెన్యూ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకునే అధికారం కూడా ఉంది. అయితే, కళ్లెదుట భారీగా ఇసుక మేటలు కనిపిస్తున్నా అధికారులు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇసుక కోసం సాధారణ ప్రజలు అధికారపార్టీ నేతలు చెప్పిందే రేటు చెల్లించి తీసుకెళ్లాల్సి వస్తోంది. ♦ డోన్ – బేతంచర్ల రహదారి పక్కనే పారిశ్రామిక వాడ ఆనుకొని ఉన్న 702 జెడ్‌లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కొండను తొలిచి టీడీపీ నాయకులు నిరాటకంగా చదును చేస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇక్కడ చదును చేసిన స్థలాన్ని ఎకరా రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. ♦ ప్యాపిలి మండలం ఊటకొండ గ్రామ పరిధిలోని ఉమా మహేశ్వర స్వామికి చెందిన 8.60 ఎకరాల భూమిని అధికారపార్టీ నాయకుడు ఆక్రమించుకున్నాడు. అనేక గ్రామాల్లో మాన్యం భూములను సైతం దిగమింగి దేవుళ్లకే శఠగోపం పెడుతున్నారు. ధూపదీప నైవేద్యాలు, నిత్యపూజల కోసం పూర్వికులు ఏర్పాటు చేసిన మాన్యం భూములను సైతం అధికారపార్టీ నాయకులు వదలడం లేదు. బంధువుల ఇంటికి దారేశారు.. డోన్ మునిసిపాలిటీలోనూ అధికారపార్టీ నేతలదే పెత్తనంగా సాగుతోంది. మునిసిపాలిటీ చైర్ పర్సన్ కోట్రికె గాయత్రీదేవి జన నివాసాల్లో అభివృద్ధి పనులు చేపట్టకుండా తన బంధువులైన కోట్రికె శేషయ్య కుటుంబీకుల స్థలాల్లో డ్రైనేజీ, సీసీరోడ్లును నిర్మించారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను ఈ విధంగా పక్కదారి పట్టిస్తున్నారు. ♦ ఏ మాత్రమూ జన నివాసాలు లేని ప్రాంతాల్లో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకే కన్నపుకుంట, దత్తనగర్ ప్రాంతాల్లో సీసీరోడ్లను నాసిరకంగా నిర్మించి జేబులు నింపుకున్నారు. అంతేకాకుండా పనులన్నింటినీ నామమాత్రంగా టెండరు ప్రక్రియను అమలు చేసి అత్యధికం పనులను నామినేషన్‌పై అప్పగిస్తున్నారు. ♦ ఎవరైనా ధైర్యంగా కొన్ని పనులకు టెండర్లు వేసేందుకు వస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. మున్సిపల్ టెండర్లలో పాల్గొనేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కేఈ ప్రతాప్ అనుచరులు దాడులు చేసి హత్యచేసేందుకు ప్రయత్నించారు. ♦ మున్సిపల్ పరిధిలో లే –అవుట్ లేకుండానే స్థలాలను ప్లాట్లుగా వేసి కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలను అధికారపార్టీ నేతలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మూలంగా ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని మున్సిపాలిటీ నష్టపోతోంది. గోనె సంచుల్లోనూ గోకుడే వేరుశనగ, కంది పంటలను కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు రైతులకు ఖాళీ సంచులను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా గతేడాది నియోజకవర్గంలోని రైతులకు లక్షా 80 వేల సంచులను తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే అధికారపార్టీ నాయకునికి కప్పం కింద పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో మార్క్‌ఫెడ్ అధికారి రైతులకు ఖాళీ సంచులు ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. అధికారి నుంచి వసూళ్లు చేసిన మొత్తాన్నే దిన, వారం సంత కోసం మున్సిపాలిటీకి సదరు నాయకుడు డిపాజిట్ చెల్లించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరుగుదొడ్లలోనూ... డోన్ నియోజకవర్గంలో పేద ప్రజలు నిర్మించుకొన్న వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సైతం థర్డ్‌పార్టీ పేరుతో అధికారపార్టీ నేతలు దిగమింగారు. లబ్ధిదారులకు అందాల్సిన బిల్లులన్నీ థర్డ్‌పార్టీ అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు తమ బ్యాంక్ ఖాతాల్లో లబ్ధిదారుల సొమ్మును వేయించుకొని స్వాహా చేశారు. ప్యాపిలి, బేతంచర్ల, డోన్ మండలాల్లోని అనేక గ్రామాల్లో ఈ దోపిడీ పర్వం నిరాటకంగా సాగింది. ఏకంగా ఇదే ఆరోపణలతో ఒక ఎంపీడీఓపై సైతం వేటు పడింది. దర్జీల స్థలాలు.. దర్జాగా కబ్జా 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు... ప్రస్తుత డిప్యూటీ సీఎంకేఈ కృష్ణమూర్తి జాతీయ రహదారి పక్కన ఉన్న 270 సర్వే నంబర్లో 4 ఎకరాల స్థలంలో టైలర్స్‌కు ఇళ్లపట్టాలు ఇచ్చారు. ఆయన చేతుల మీదుగా తమకు ఇళ్లపట్టాలు వచ్చాయన్న సంతోషంతో ఏకంగా ఆ కాలనీకి కేఈ కృష్ణమూర్తి నగర్‌గా పేరు పెట్టారు. అయితే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా... అన్న పంచిన పట్టాలను తమ్ముడుఆధ్వర్యంలో అధికారపార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. తమ ఇళ్ల పట్టాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సుమారు 200 బేస్ మట్టాలను నిర్దాక్షిణ్యంగా నేల మట్టం చేశారు. అయితే, ఇక్కడ ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరుతో బహుళంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అసలైన లబ్ధిదారులను కాదని టీడీపీ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వంకను కుదించి.. ప్రభుత్వ నిధులతో గోడ కట్టి డోన్ పట్టణం నడి ఒడ్డున ఉన్న వంక భూమిని అధికారపార్టీకి చెందిన మరో నేత... చదును చేసుకుని పొలంగా మార్చడమే కాకుండా ఏకంగా ఉన్న కొద్దిపాటి వాగుకు అడ్డంగా గోడను కూడా నిర్మించారు. వాగు నీరు పొలంలోకి రాకుండా చేసేందుకు ఈ విధంగా చేసుకున్నారు. అయితే, ఈ గోడను కూడా ప్రభుత్వ నిధులతో నిర్మించడం గమనార్హం. ఖాళీ జాగా.. వేసెయ్ పాగా.. మునిసిపాలిటీగా మారిన తర్వాత డోన్‌లో భూమి ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ నేతల కన్ను ప్రభుత్వ స్థలాలపై పడింది. ప్రధానంగా వాగులు, వంక భూములతో పాటు వక్ఫ్ భూములపై కన్నేశారు. అనుకున్నదే తడువుగా.... ఆయా భూములను అధికార పార్టీ అండతో నేతలు కాస్తా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఈ విధంగా ఎక్కడ ఖాళీ జాగా కనిపించినా సరే తీసేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. పెద్దొంక హాంఫట్ డోన్ పట్టణ నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్ 323/ఏ లో ఉన్న 2.70 ఎకరాల విస్తీర్ణంలోని వక్ఫ్‌బోర్డు భూమిని అధికార పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్‌ను అడ్డుపెట్టి ఆక్ర మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూమి విలువ ఎకరా సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా. దీనిపై వక్ఫ్ అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా మిన్నకుండిపోతున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం కాస్తా రెవెన్యూ మంత్రి కావడంతో రెవెన్యూ అధికారులు... ఫిర్యాదులు వచ్చినప్పటికీ కనీసం కన్నెత్తి చూసేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఈ భూమికి ఆనుకొని ఉన్న పెద్దొంకను సమూలంగా నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పెద్దొంక నీటిని ఇతర వంకలకు మళ్లించేందుకు పెద్దొంకకు గండికొట్టారు. నాయీ బ్రాహ్మణుల గూడు కొల్లగొట్టారు పట్టణ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువ చేసే సర్వే నంబర్ 379/1 రెండెకరాల విస్తీర్ణంలోని భూమిని 15 ఏళ్ల క్రితం నాయీ బ్రాహ్మణులకు ఇళ్లపట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు చేసి బేస్ మట్టాల వరకు నిర్మాణాలు చేపట్టారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న గౌడ్ ఆధ్వర్యంలో కేఈ ప్రతాప్ సూచనల మేరకు ఈ ప్రాంతంలోని బేస్ మట్టాలను ప్రొక్లైన్లతో నేలమట్టం చేశారు. నాయీ బ్రాహ్మణుల గోడును పట్టించుకోకుండా వారి స్థలాల్లో ప్లాట్లువేసి సెంటు రూ.5లక్షల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకొన్నారు. ఈ విషయం పై నాయీ బ్రాహ్మణులు లోలోపల రగిలిపోతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగదనే నిరాశలో మిన్నుకున్నారు. గంగ పుత్రుల స్థలం.. అనుచరుల పరం పట్టణ శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలోని సర్వే నంబర్ 564లో 4.80 ఎకరాలు, 914 సర్వే నంబర్లో 1.70 ఎకరాల విస్తీర్ణంలో గంగమ్మ మాన్యం భూమి ఉంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఈ ప్రతాప్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులు మాన్యం భూమిని ఆక్రమించి పునాదులు కూడా తీశారు. దీంతో గంగపుత్రులు తమకు న్యాయం చేయాలంటూ కేఈ ప్రతాప్‌ను ఆశ్రయించగా ‘మీకు అంత భూమి అవసరం లేదు’ అని పంచాయితీ నిర్వహించి కేవలం రెండెకరాలు మాత్రమే కేటాయించి మిగిలిన 4.50 ఎకరాలను తన అనుచరులకు ధారాదత్తం చేశారనే విమర్శలు ఉన్నాయి. పక్కనే ఉన్న బుగ్గమాన్యం భూమిని సైతం ఆక్రమించి ప్లాట్లు వేసి టీడీపీ నాయకులు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే, ఇన్ని జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం అటువైపుగా వెళ్లి కనీసం పరిశీలించేందుకు కూడా సాహసించడం లేదు. -
ఎంఐ–8 హెలికాప్టర్లకు వీడ్కోలు
సాక్షి, బెంగళూరు: దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాయుధ బలగాలకు సేవలందించిన ఎంఐ–8 హెలికాప్టర్లు తెరమరుగయ్యాయి. ‘ప్రతాప్’గా పిలిచే సోవియెట్ కాలానికి చెందిన ఈ హెలికాప్టర్లకు వాయుసేన ఆదివారం అధికారికంగా వీడ్కోలు పలికింది. 1972లో భారత వాయుసేనలో చేరిన ఇవి ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ పవన్ లాంటి కీలక సమయాల్లో సైనికులు, వాహనాల తరలింపులో విశేష సేవలందించాయి. బెంగళూరులోని ఎలహంక వైమానిక స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో చివరిసారిగా ఇవి తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్(రిటైర్డ్) ఫాలి హోమి మేజర్‌తో పాటు కొందరు మాజీ వాయు సేనాధికారులు చివరిసారి ఈ హెలికాప్టర్లను నడిపారు. కార్యక్రమంలో విశ్రాంత వాయుసేన ఉద్యోగులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పండుగకు వచ్చి పరలోకాలకు..
పుట్టపర్తి అర్బన్: పొట్ట కూటి కోసం వలస వెళ్లి.. వినాయక చవితిని స్వగ్రామంలో చేసుకుందామని వచ్చిన కూలీని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పుట్టపర్తి రూరల్ ఇన్చార్జి ఎస్ఐ రాజశేఖరరెడ్డి, ఏఎస్ఐ ప్రసాద్, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కొట్లపల్లికి చెందిన పెద్దన్న, మణెమ్మ దంపతుల పెద్ద కుమారుడు నరిగెప్పగారి ప్రతాప్ (25) బెంగళూరులో టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవడానికి స్వగ్రామం కొట్లపల్లికి వచ్చాడు. శుక్రవారం గణపతి పూజ అయిన అనంతరం భోజనం ముగించుకుని బుగ్గపల్లిలో రైతు వద్ద తనకు రావాల్సిన కూలి డబ్బు తెచ్చుకునేందుకు వెళ్లాడు. అక్కడ పని చూసుకుని బైక్‌పై తిరిగి వస్తుండగా బుగ్గపల్లి సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోతిలోకి దూసుకెళ్లాడు. పెద్ద బండరాయిపై ఎగిరిపడిన ప్రతాప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ‘ఏ పని చెప్పినా ఇట్టే చేసిపెట్టేవాడని.. ఇద్దరి పని ఒకడే చేసే వాడని.. చిన్న వయసులోనే మాకు దూరం చేశావా దేవుడా.. అని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. -
కాంగ్రెస్‌కు ప్రతాప్ గుడ్‌బై
- గులాబీవైపు చూపు కాంగ్రెస్‌కు రాంరాం చెప్పిన ప్రతాప్ టీఆర్ఎస్లో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ గురువుగా భావించే డీఎస్ కూడా గులాబీ గూటికి చేరినందున తాను కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానానికి కూడా సంకేతాలు పంపిన ప్రతాప్.. చేరికకు ముహూర్తం ఖరారు చేసుకోవడంలో తలమునకలయ్యారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ సీనియర్ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వ్యవహారశైలిపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న ఆయన శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖను ఫాక్స్‌లో పంపారు. 2014 శాసనసభ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ టికెట్‌ను ఆశించి భంగపడిన ఆయన ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అదేసమయంలో డీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ హైకమాండ్ వ్యవహరించిన తీరుతో నొచ్చుకున్నారు. ఈ క్రమంలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో విసుగుచెందిన ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా రెండుసార్లు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకంగా వ్యవహరించానని ప్రతాప్ అన్నారు. రాజీనామా లేఖను పంపిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ప్రతాప్.. కాంగ్రెస్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చారని విమర్శించారు. గతేడాది తనకు టికెట్‌ను ఎందుకు నిరాకరించారో కారణం చెప్పాలని పలుమార్లు ఏఐసీసీకి లేఖ రాసినా స్పందించలేదన్నారు. కేవలం పైరవీకార్లకు, దళారీలకే కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లభిస్తోందని ఆరోపించారు.