సాక్షి, బెంగళూరు: దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు సాయుధ బలగాలకు సేవలందించిన ఎంఐ–8 హెలికాప్టర్లు తెరమరుగయ్యాయి. ‘ప్రతాప్’గా పిలిచే సోవియెట్ కాలానికి చెందిన ఈ హెలికాప్టర్లకు వాయుసేన ఆదివారం అధికారికంగా వీడ్కోలు పలికింది. 1972లో భారత వాయుసేనలో చేరిన ఇవి ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ పవన్ లాంటి కీలక సమయాల్లో సైనికులు, వాహనాల తరలింపులో విశేష సేవలందించాయి. బెంగళూరులోని ఎలహంక వైమానిక స్థావరంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో చివరిసారిగా ఇవి తమ విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్(రిటైర్డ్) ఫాలి హోమి మేజర్‌తో పాటు కొందరు మాజీ వాయు సేనాధికారులు చివరిసారి ఈ హెలికాప్టర్లను నడిపారు. కార్యక్రమంలో విశ్రాంత వాయుసేన ఉద్యోగులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment