
ఒకచోట కూర్చొని పని చేయడం... మహిళల్లో మరీ ప్రమాదకరం!
కొత్త పరిశోధన
ఒకచోట కదలకుండా కూర్చొని పనిచేయడం వల్ల జీవనశైలికి సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తాయని ఇప్పటికీ నిరూపితమైంది. ఇది పురుషుల కంటే మహిళల్లో మరీ ప్రమాదమని పరిశోధనలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. అదేపనిగా ఆరు గంటల పాటు కూర్చొని పనిచేసే మహిళల్లో మిగతా మహిళలతో పోలిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం 10 శాతం ఎక్కువ. (అది ఏ రకమైన క్యాన్సర్ అయినా కావచ్చు). ఇక ఇలా కదలకుండా కూర్చొని ఉండే మహిళల్లో మల్టిపుల్ మైలోమా వచ్చే అవకాశాలు 65 శాతం ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
నడుస్తూ ఉండేవారు, చురుగ్గా ఉండే మిగతా మహిళలతో పోలిస్తే ఇలా ఆరుగంటల పాటు కూర్చొని ఉండే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు 10 శాతం ఎక్కువ. ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏకంగా 43 శాతం అధికం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ వివరాలన్నింటినీ ఇటీవలే ‘క్యాన్సర్ ఎపిడిమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు.