Spring
-
అబ్బో.. అబ్బూరి బ్రదర్స్!
అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ.. అబ్బూరి ఫ్యామిలీ చేతిలో మా కష్టార్జితాన్ని పోసి పూర్తిగా మోసపోయాం. మాలా మీరెవరూ మోసపోవద్దు. వీళ్లు పెద్ద మోసగాళ్లు. నీతి, నిజాయితీ అన్నదే లేదు. ఇక్కడ మమ్మల్ని మోసం చేసినట్లే పెద్ద వెంచర్ పేరుతో వైజాగ్‌లో వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. – హైదరాబాద్‌లో ఉర్సా బాధితుల ఆక్రోశం సాక్షి, అమరావతి: మోసాలే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అబ్బూరి బద్రర్స్ హైదరాబాద్‌లో విల్లాల పేరుతో అనేక మందికి కుచ్చుటోపీ పెట్టారు! తాజాగా ఉర్సా ముసుగులో విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు! ఈ బాగోతం బయట పడటంతో ముసుగు దొంగల వెనక ఉన్న ముఖ్యనేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. ఈ నేపథ్యంలో ఓ ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అబ్బూరీ.. ఇది నిజం కాదా? ఉర్సా క్లస్టర్స్‌లో ప్రధాన ప్రమోటర్‌గా ఉన్న సతీష్ అబ్బూరి ఫ్యామిలీ ‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ’ పేరుతో పలు డొల్ల కంపెనీలను నెలకొల్పి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఉంటున్నామని.. ఎన్నారైలమని.. తమ నెట్‌వర్త్ రూ.వందల కోట్లంటూ అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్‌లో విల్లాలు కడతామని ప్రచారం చేసుకుని కష్టార్జితాన్ని ధారపోసిన వారికి కుచ్చుటోపీ పెట్టారు. ముగ్గురు అన్నదమ్ముల్లో వెంకట్ అబ్బూరి, సతీష్ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా హైదరాబాద్‌లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారు.అమెరికాలో ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్సీ పేరుతో సతీష్ అబ్బూరి కంపెనీ నమోదు అయిన విషయాన్ని కేశినేని నాని సాక్ష్యాలతో సహా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం తెలిసిందే. దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి లతతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య కేశినేని జానకిలక్ష్మి డైరెక్టర్లుగా వ్యవహరించారు. కేశినేని చిన్ని వైదొలగిన తర్వాత జానకిలక్ష్మి డైరెక్టర్‌గా కొనసాగారు. అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీకి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేశారు. అంతా కలసి పంగనామం.. హైదరాబాద్‌లోని నిజాంపేట, బాచుపల్లి, గాజులరామారం, ఎల్బీనగర్ వద్ద ‘స్ప్రింగ్ వ్యాలీ’ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిరి్మస్తున్నట్లు సతీష్ అబ్బూరి ఫ్యామిలీ భారీగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కోట్లాది రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వందలాది మంది తమ కష్టార్జితాన్ని వీరి వద్ద ఇన్వెస్ట్ చేసి దారుణంగా మోసపోయారు. కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో రామకృష్ణ ఫ్యామిలి రెండేళ్లు కనపడకుండా పారిపోయినట్లు ఓ బాధితుడు పేర్కొన్నారు. బాధితులు అంతా కలసి ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని అబ్బూరి ఫ్యామిలీ చేతిలో ఎలా మోసపోయారో ప్రపంచానికి చాటి చెప్పారు. తమలా మరెవరూ మోసపోవద్దని హెచ్చరించారు.ఎట్టకేలకు అమెరికాలో పని చేస్తున్న సతీష్ అబ్బూరి ఒరాకిల్ కంపెనీ చిరునామా, ఫోన్ నంబరు వివరాలను సేకరించి అక్కడున్న వారు ఎవరైనా సాయం చేయాలంటూ ప్రాథేయపడ్డారు. దీన్ని బట్టి బాధితులు ఎంత నరకం అనుభవించారో ఊహించవచ్చు. ఆ ముగ్గురు సోదరులు తమ వెనుక పెద్ద శక్తులున్నాయని, తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నారని ఓ బాధితుడు వాపోయాడు. ‘మోసగాళ్లయిన వీళ్లు వైజాగ్‌లో వెంచర్ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాలా మీరు మోసపోకండి..’ అంటూ పలువురు బాధితులు గతంలోనే హెచ్చరించారు. అదే మోసగాళ్లు ఇప్పుడు ఉర్సా పేరుతో మళ్లీ విచ్చేస్తున్నారంటూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ’తో తనకు సంబంధం లేదని సతీష్ అబ్బూరి జూమ్ మీటింగ్‌లో పేర్కొన్నాడు. ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో బాధితుల వాయిస్లున్న పేజీలను డేటాబేస్ నుంచి పూర్తిగా తొలగించేశారు. ఒకపక్క బాధితులను బెదిరిస్తూ.. మరోపక్క వెబ్సైట్లో పేజీలను డిలీట్ చేయించటాన్ని బట్టి దొంగెవరో ప్రత్యేకించి చెప్పాలా..? అని బాధితులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన
జైపూర్: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వీటిని అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 'స్బ్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల'ను అమర్చుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నించాలి కానీ.. సీలింగ్ ఫ్యాన్లు కాదని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు నిలయంగా ఉంటుంది రాజస్థాన్‌లోని కోటా. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు అక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సారి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి(18) చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెలలో ఇది నాలుగో ఆత్మహత్య కావడం గమనార్హం. #WATCH | Spring-loaded fans installed in all hostels and paying guest (PG) accommodations of Kota to decrease suicide cases among students, (17.08) https://t.co/laxcU1LHeW pic.twitter.com/J16ccd4X0S — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2023 అయితే.. ఎక్కువగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. ఏమాత్రం బరువు పడినా వెంటనే ఊడివచ్చేలా ఫ్యాన్లను అమర్చారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిగతులను మార్చాలని, అందుకు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో! -
పట్టాభిషేకం..ఉప్పొంగిన ఉత్సాహం
రాయదుర్గం: గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 25వ వసంతంలోకి అడుగిడి..22వ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకొంది. శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులున తల్లిదండ్రులు, చదువులు చెప్పిన గురువుల సమక్షంలో పట్టాలు అందుకోని అంతులేని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ప్రాంగణమంతా సందడి వాతావరణంలో మునిగింది. ఈ సందర్భంగా 519 మంది గ్రాడ్యుయేట్లకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఇక మొదటిసారిగా ఎంఎస్ బై రీసెర్చ్ అండ్ డుయల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా పట్టాలు పొందారు. 25 మందికి పీహెచ్‌డీలు అందించారు. -
బాలుడి ఊపిరితిత్తుల్లో స్ప్రింగ్
ముంబాయి: మహారాష్ట్రలోని భీవండికి చెందిన ఏడేళ్ల బాలుడు టాయ్ గన్‌లోని స్ప్రింగ్ మింగేయడంతో పరిస్థితి విషమంగా మారింది. బాలుడు ఇంటి వద్ద టాయ్ గన్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు. అనుకోకుండా టాయ్గన్లోని స్ర్పింగ్ బాలుడి స్వరపేటిక ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయి ఇరుక్కుపోయింది. ఈ విషయం ఎవరూ గమనించలేదు. ఆ తర్వాత బాలుడు నిరంతరాయంగా దగ్గుతుండటంతో తల్లిదండ్రులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరిశీలించిన థానేలోని ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు, ఊపిరితిత్తుల్లో 1.5 సెంటీమీటర్ల పొడవున్న స్ప్రింగ్ ఉన్నట్లు గుర్తించారు. బాలుడు కావడంతో ఆపరేషన్ చేసి స్ప్రింగ్‌ను తీయడానికి డాక్టర్లు వెనకాడారు. బయోస్కోపీ ద్వారా స్ప్రింగ్‌ను తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. బాలుడి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని డాక్టర్లు తెలిపారు. -
ఇద్దరు మహిళల అనుమానాస్పద మృతి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా, మరో మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. చిత్తాపూర్ గ్రామానికి చెందిన వసంత (29) శనివారం రాత్రి మృతి చెందగా ఆదివారం విషయం బయటకు వచ్చింది. భర్త కుటుంబీకులే హత్య చేశారని వసంత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన లలిత (40) శనివారం నుంచి కనిపించకుండా పోయింది. ఆదివారం గ్రామంలోని ఓ బావిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. -
నేడు తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం
సాక్షి,తిరుమల: శ్రీరామనవమిని పురస్కరించుకుని శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆలయంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తారు. తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. అలాగే ఆదివారం రాత్రి 8 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, 29న వసంతోత్సవం మాత్రం రద్దు చేశారు. 2 నుంచి శ్రీవారి వసంతోత్సవాలు తిరుమలలో ఏప్రిల్ 2 నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ఆరంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, పూజలు నిర్వహించనున్నారు. 4న ఆలయం మూత ఏప్రిల్ నాలుగో తేదీ శనివారం మధ్యాహ్నం 3.45 గంటల నుండి రాత్రి 7.15 గంటల వరకుచంద్రగ్రహణం సందర్భంగా ఆరోజు ఉదయం 9.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుమల ఆలయం మూసివేస్తారు. -
గ్రహం అనుగ్రహం
శ్రీ జయనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, తిథి బ.నవమి రా.12.32 వరకు నక్షత్రం స్వాతి తె.4.20 వరకు (తెల్లవారితే గురువారం) వర్జ్యం ఉ. 9.01 నుంచి 10.40 వరకు దుర్ముహూర్తం ప.11.45 నుంచి 12.35 వరకు అమృతఘడియలు రా.7.05 నుంచి 8.46వరకు భవిష్యం మేషం: చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సంతృప్తి. వృషభం: కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథునం: కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. కర్కాటకం: శ్రమ ఫలించదు. పనులు మధ్యలో విరమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. సింహం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. అందరిలోను గుర్తింపు. కృషి ఫలిస్తుంది. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం. కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆలయ ద ర్శనాలు. తుల: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. వృశ్చికం: రాబడి తగ్గి అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు: బంధువులతో సత్సంబంధాలు. ఆసక్తికరమైన సమాచారం. రాబడి పెరుగుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం. వాహన సౌఖ్యం. మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం. కుంభం: బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమాలలో అవరోధాలు. కుటుంబంలో చికాకులు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు. - సింహంభట్ల సుబ్బారావు