![Triple IT Hyderabad 25th Spring 22nd Graduation - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/23/iiit.jpg.webp?itok=aQ4fMMZy)
రాయదుర్గం: గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ 25వ వసంతంలోకి అడుగిడి..22వ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా జరుపుకొంది. శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వివిధ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులున తల్లిదండ్రులు, చదువులు చెప్పిన గురువుల సమక్షంలో పట్టాలు అందుకోని అంతులేని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ప్రాంగణమంతా సందడి వాతావరణంలో మునిగింది. ఈ సందర్భంగా 519 మంది గ్రాడ్యుయేట్‌లకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఇక మొదటిసారిగా ఎంఎస్ బై రీసెర్చ్ అండ్ డుయల్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా పట్టాలు పొందారు. 25 మందికి పీహెచ్‌డీలు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment