శ్రీ జయనామ సంవత్సరం
దక్షిణాయనం, హేమంత ఋతువు
పుష్యమాసం, తిథి బ.నవమి రా.12.32 వరకు
నక్షత్రం స్వాతి తె.4.20 వరకు
(తెల్లవారితే గురువారం)
వర్జ్యం ఉ. 9.01 నుంచి 10.40 వరకు
దుర్ముహూర్తం ప.11.45 నుంచి 12.35 వరకు
అమృతఘడియలు రా.7.05 నుంచి 8.46వరకు
భవిష్యం
మేషం: చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. అందరిలోనూ గుర్తింపు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సంతృప్తి.
వృషభం: కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం: కుటుంబ సమస్యలు కొంత వేధిస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలిసిరావు.
కర్కాటకం: శ్రమ ఫలించదు. పనులు మధ్యలో విరమిస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
సింహం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. అందరిలోను గుర్తింపు. కృషి ఫలిస్తుంది. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం.
కన్య: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సభ్యులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆలయ ద ర్శనాలు.
తుల: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
వృశ్చికం: రాబడి తగ్గి అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు: బంధువులతో సత్సంబంధాలు. ఆసక్తికరమైన సమాచారం. రాబడి పెరుగుతుంది. కార్యజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం. వాహన సౌఖ్యం.
మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.
కుంభం: బాధ్యతలు పెరుగుతాయి. కార్యక్రమాలలో అవరోధాలు. కుటుంబంలో చికాకులు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.
- సింహంభట్ల సుబ్బారావు
గ్రహం అనుగ్రహం
Published Wed, Jan 14 2015 3:03 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM
Advertisement
Advertisement