
Dil Raju Clarifies On F3 Movie Ticket Rates Hike: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూడేళ్ల క్రితం వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 2 చిత్రానికి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా, మెహ్రీన్, హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఎఫ్ 3లో కూడా వారే హీరోయిన్లు కాగా సోనాల్ చౌహన్ ఓ ప్రధాన పాత్ర పోషించనుంది.
చదవండి: నార్త్ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ
ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎన్నో వాయిదాల అనంతరం మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ ఇంకా కొద్ది రోజులే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ 3 మూవీ టికెట్ ధరల పెంపుపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్ ధరలు పెంచిన విషయం విధితమే. దీంతో తాజాగా ఎఫ్ 3కి కూడా టికెట్ ధరలు పెంచుతారా? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్ రేట్స్ పెంపుపై క్లారిటీ ఇచ్చాడు మూవీ నిర్మాత దిల్ రాజు.
చదవండి: జై భీమ్ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్‌ఐఆర్
ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన ఇచ్చారు. ‘ఎఫ్ 3 చిత్రానికి టికెట్ ధరలు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మా సినిమాను మీ ముందుకు తెస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. కాగా డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అనే కథనంతో 'ఎఫ్-3' సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా త్వరలోనే ఎఫ్ 3 మూవీ టీం ప్రచార కార్యక్రమాలతో ప్రారంభించనుంది.