అమరావతి: సినిమా థియేటర్లలో తినుబండారాలు, శీతల పానియాలను అధిక ధరలకు విక్రయించే అంశంపై కఠినంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. సినిమా థియేటర్లలో టికెట్ ధరల పెంపు అంశంపై గురువారం అధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల థియేటర్లు, ఏసీ, నాన్ ఏసీ సౌకర్యాలను అనుసరించి ధరల పెంపు అంశంపై చర్చించారు. టికెట్ ధరల పెంపు అంశంపై నివేదిక ఇవ్వాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు.