టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన నివాసానికి వచ్చిన సమయం నుంచి ఏపీలో పెద్ద చర్చనీయాంశం అయింది. అయితే, తాజాగా వర్మ పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కేసుల విషయంపై పలు సంచలన విషయాలను వెళ్లడించారు. ఇంతకీ వర్మను అరెస్ట్ చేసేందుకే పోలీసులు ఆయన డెన్‌కు వెళ్లారా..? కేసుల భయంతో వర్మ తప్పించుకున్నారా..? పారిపోయారా..? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
'సంవత్సర క్రితం నేను చేసిన పోస్ట్‌కు నాలుగు జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల విషయంలో నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాలేదు. వర్మను అరెస్ట్ చేస్తున్నామని వారు కూడా ఇంతవరకు తెలపలేదు. నేను తప్పించుకుని తిరుగుతున్నానని ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడా చెప్పలేదు. నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు గేటు బయటే ఎందుకున్నారు. అరెస్ట్ చేయాలనుకున్నవారు లోపలికి రావచ్చు కదా.. కానీ, వాళ్లు రాలేదు. ఈ కేసుల వెనక ఎవరున్నారని తెలుసుకునేందుకే నేను కోర్టుకు వెళ్లాను. నేను బాగానే ఉన్నాను. అయితే, ఎలా ఉన్నానంటూ నా సన్నిహితులు చూపుతున్న సానుభూతి భరించలేకున్నా.' అని తనదైన స్టైల్లో ఆయన చెప్పారు.
నేను ఎప్పుడో చేసిన పోస్ట్‌లపై ఇప్పుడు కేసులు పెడుతున్నారు. నాపై కేసులు పెట్టిన ఆ తొమ్మిది మంది నా పోస్టులను ఇప్పుడే చూశారట. అందుకే కేసులు పెట్టారట. ఇది నమ్మే విషయమా..? నేను కేసులకు భయపడను ఐ డోంట్ కేర్. న్యాయవ్యవస్థ అంటే నాకు గౌరవం ఉంది.పోలీసుల మీదా నమ్మకం ఉంది. చట్ట ప్రకారం వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా అంగీకరిస్తా.' అని ఆయన అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా కేసులు విషయంలో సారీ ఏమైనా చెప్తారా..? అనే ప్రశ్నకు వర్మ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. కేసులు, ఏపీ రాజకీయ అంశాలపై వర్మ చెప్పిన సంచలన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment